కాకినాడ
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొత్తపేట మండల పరిధిలోని సంఘం పాలెం గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఒక లారీ పాఠశాలలోనికి దూసుకు పోయింది.ప్రమాద సమయంలో విద్యార్థులు లేకపోడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.