శ్రీహరికోట ఫిబ్రవరి 4,
మామ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, చంద్రయాన్ 2 విషయంలో కాస్త వెనకబడింది. ఎలాగైనా చంద్రునిపై కాలు మోపాలని చూసిన చంద్రయాన్ 2 చివరిక్షణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయింది. అయితే, చంద్రయాన్ 3ని ప్రయోగించాలని అప్పట్లోనే ప్రకటించారు. గతేడాది ప్రయోగించాల్సిన ఈ చంద్రయాన్ 3 కరోనా కారణంగా వాయిదా పడింది. దీనిపై రాజ్యసభలో మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చంద్రయాన్ 3 మిషన్‌ను తప్పనిసరిగా సక్సెస్ చేస్తామని మంత్రి తెలిపారు. చంద్రయాన్ 3 పై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. కరోనా కారణంగా చాలా ప్రయోగాలు వాయిదా పడ్డాయని, త్వరలోనే అన్నింటిని ప్రయోగిస్తామని అధికారులు చెబుతున్నారు.