అమరావతి
సీఎం జగన్ తో మంత్రుల కమిటి భేటీ ముగిసింది. శనివారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు. ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఇప్పుడు మళ్లీ సమావేశమవుతున్నాం. అన్ని అంశాలు సీఎంకి వివరిస్తాం. హెచ్ ఆర్ ఏ గురించి ఈ రోజు చర్చిస్తాం. రికవరీ విషయంలో క్లారిటీ ఇచ్చాం. దీనివల్ల 6 వేల కోట్లు భారం ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే అన్నారు మంత్రి బొత్స.
స్టీరింగ్ కమిటీ సభ్యులు తమ ముందు పెట్టిన ఇతర డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మంత్రుల కమిటీ. సీఎం భేటీ అనంతరం సచివాలయానికి చేరుకుంది మంత్రుల కమిటీ