YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మరింత తగ్గనున్న ఆయిల్ ధరలు

మరింత తగ్గనున్న ఆయిల్ ధరలు

ముంబై ఫిబ్రవరి 5,
ఎడిబుల్ ఆయిల్ ధరలను మరింత తగ్గించడానికి,హోర్డింగ్‌ను అరికట్టడానికి కేంద్రం శుక్రవారం వంటనూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితిని జూన్ 30 వరకు పొడిగించింది. ఇది కాకుండా, స్టాక్ హోల్డింగ్ పరిమితులపై మునుపటి ఆర్డర్‌ను అమలు చేయని రాష్ట్రాలు విధించాల్సిన స్టాక్ పరిమితులను కూడా ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లలో కూడా ధరలు పెరిగాయి. గత సంవత్సరం, ప్రభుత్వం ధరల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంది. దీని కారణంగా వంట నూనెల ధరలలో కొంత తగ్గుదల కనిపించింది. సరఫరా పెరుగుదలతో ధరలు మరింత తగ్గాలని ప్రభుత్వం భావిస్తోందిఅంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెకు అధిక ధరలు ఉండడంతో దేశీయంగా నూనె ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయని ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేలా చూడడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని కలిగి ఉందని చెప్పింది. దిగుమతి సుంకం హేతుబద్ధీకరణతోపాటు వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్‌ స్వీయ-బహిర్గతం కోసం వెబ్-పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నూనె ధరల తగ్గిపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని గత ఏడాది ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‎లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలను కేంద్రప్రభుత్వం వెబ్సైట్‎లో అప్డేట్ చేయాలని కోరింది.అక్టోబర్ 2021లో, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 2022 వరకు స్టాక్ పరిమితులను విధించింది. అందుబాటులో ఉన్న స్టాక్, వినియోగ విధానాల ఆధారంగా స్టాక్ పరిమితులను నిర్ణయించడానికి రాష్ట్రాలకు వదిలివేసింది. కేంద్రం అక్టోబర్ 2021 ఆర్డర్ ప్రకారం.. ఆరు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,బీహార్ తమ తమ రాష్ట్రాల్లో స్టాక్ హోల్డింగ్ పరిమితులను నిర్ణయించాయి. తినదగిన నూనెల కోసం రిటైలర్లకు 30 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులకు 500 క్వింటాళ్లు, బల్క్ వినియోగదారులకు 30 క్వింటాళ్లు,. రిటైలర్లు, దుకాణాలకు 1,000 క్వింటాళ్ల స్టాక్ పరిమితి ఉంటుంది. నూనెల ప్రాసెసర్లు వాటి నిల్వ సామర్థ్యంలో 90 రోజుల వరకు నిల్వ చేయగలవు. తినదగిన నూనెగింజల కోసం రిటైలర్లకు 100 క్వింటాళ్లు, టోకు వ్యాపారులకు 2,000 క్వింటాళ్ల స్టాక్ పరిమితి ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ప్రాసెసర్లు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 90 రోజుల ఆహార నూనెల ఉత్పత్తిని నిల్వ చేయగలవని ప్రకటనలో తెలిపింది. ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కొన్ని హెచ్చరికల నేపథ్యంలో ఆర్డర్ పరిధి నుండి దూరంగా ఉంచినట్లు తెలిపింది.విదేశీ మార్కెట్లలో ధరలు పెరగడంతో ఎడిబుల్ ఆయిల్ ఖరీదైపోయింది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ రిటైల్‌ ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారతదేశంలో తినదగిన నూనెల వినియోగం 22-22.5 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 65 శాతం చమురు దిగుమతి అవుతుంది. డిమాండ్, దేశీయ సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి దేశం 13-15 మిలియన్ టన్నుల ఎడిబుల్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై ఆధారపడటం వల్ల విదేశీ మార్కెట్లలో ధరల పెరుగుదల ప్రత్యక్ష ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపిస్తోంది.

Related Posts