YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త జిల్లాల పై అనవసర రాద్దాంతం

కొత్త జిల్లాల పై అనవసర రాద్దాంతం

గుంటూరు, ఫిబ్రవరి 5,
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ప్రకటనపై రగడ కొనసాగుతూనే ఉంది. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే.. మరికొన్ని చోట్ల తమ ప్రాంతాలను కూడా జిల్లా కేంద్రాలుగా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో ఈ ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తున్నారు. వీటిపై విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిస్పందించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు తావు లేదని సమర్థించుకున్నారువాళ్ల సంగతి కూడా తేలుస్తాం.. ‘కడపజిల్లాలో రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో రాయచోటి కేంద్రంగా జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాం. అదేవిధంగా హిందూపురం పరిధిలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి పేరుతో జిల్లా పెట్టాలని ప్రతిపాదించాం. విదేశాల్లో సైతం సత్యసాయికి భక్తులు ఉన్నారు. ఈనేపథ్యంలోనేభక్తులకు అనుకూలంగా ఉంటుందని సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేయాలనుకుంటున్నాం. ఇక కృష్ణాజిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు పెట్టాం..అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగూ ఈ ప్రయత్నం చేయలేకపోయారు. ఎన్‌టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి జిల్లాకు తన తండ్రి పేరు పెట్టాలని, భారతరత్న ఇవ్వాలని లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేకపోయారు. ఒంగోలుకు చెందిన గుప్తా తనకు న్యాయం చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఫ్లెక్సీ ప్రదర్శించారని తెలిసింది. అమిత్‌షాతో పాటు అమెరికా అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేసుకోమనండి… గుప్తా వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. వాళ్ల సంగతి సంగతి కూడా తేలుస్తాం. ఇక తుని ఘటనపై కేసులు ఎత్తివేయడంపై కాపు సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు’ అని మంత్రి పేర్కొన్నారు

Related Posts