YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చీలిపోయిన ఉద్యోగ సంఘాలు

చీలిపోయిన ఉద్యోగ సంఘాలు

విజయవాడ, ఫిబ్రవరి 7, (న్యూస్ పల్స్)
సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి ...సింగన్న అద్దంకి పోనూ ..పోయాడు...రానూ వచ్చాడు ..వట్టి చేతులతో సుమారు 20 రోజులకు పైగా, ‘పీఅర్సీ సాధన సమితి’ పేరిట డ్రామా నడిపిన ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు, చివరకు ఏమి సాధించారు అంటే సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి ... ఉప్పెనలా ఎగసి పడిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల, ‘చలో విజయవాడ’ ఆందోళన ఫలాలు నోటికి చెరక ముందే పీఆర్సీ సాధన సమితి నేతలు పంచేసుకున్నారు,అమ్మేసుకునంరు అనే మాటే, ఈరోజు ఉద్యోగుల నోట వినవస్తోంది.  ఏ కమిటీకి అయితే ఏ అధికాలు లేవు .. అధికారాలు లేని మంత్రుల కమిటీతో చర్చలు ఏమిటి ... ముందు పీఆర్సీ నివేదిక ఇవ్వడి ఆ తర్వాతనే చర్చలు .. అంటూ ఏ కమిటీని అయితే తూలనాడారో.. అదే కమిటీతో... పీఆర్సీ  నివేదికను కంటితో చూడకుండానే .. రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. చర్చలకు మూడు షరతులు అన్నారు .. సర్కార్ ఒక్క షరతుకు ఒప్పుకోలేదు. అయినా తగడునమ్మా అంటూ కట్టకట్టుకుని చర్చలు వెళ్లారు. రెండు రోజులు చర్చించారు.కానీ, ఏమి సాధించారు. వ్రతం చెడ్డ ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. అమ్ముడు పోయారన్న నిందను, తమ ఆశలను, హక్కులను అమ్మేశారాన్న,ఉద్యోగుల ఆవేదన తప్ప,నలుగు సంఘాలు కలిసి ఒకటైన పీఆర్సీ సాధన సమితి సాదించింది శూన్యం. ఇది ఎవరో గిట్టని వాళ్లు, ఉద్యోగుల ఆందోళన నుంచి రాజకీయ ప్రయోజనం ఆశించిన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అసలే కాదు, నేతలను నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగులు వ్యక్త పరుస్తున్న ఆవేదన, ఆగ్రహం.అంతే కాదు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాద్యాయ సంఘాలను కలుపుకుని ఏదో చేస్తారు సాధిస్తారు అనుకుంటే, తాచెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా, ఉపాధ్యాయ సంఘాలను నిలువునా ముంచేశారు. కాదు, అమ్మేశారు. ఇది కూడా ఎవరో చేసిన ఆరోపణ కాదు, ఉపాద్యాయ సంఘాల నాయకులే పోరాటం పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులు  తమను కూడా ప్రభుత్వానికి అమ్మేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు, పీఆర్సీ సాధన సమితిలో సభ్యులుగా ఉన్నఉపాధ్యాయ ప్రతినిధులు, తాము అమ్ముడుపోయందుకు సిద్దంగా లేమని తేల్చిచెప్పారు.ఉద్యోగ సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలోనే నల్ల బ్యాడ్జిలు తీసీసి, ‘సమ్మె ప్రతిపాదనను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించి.,సర్కార్’కు సలాం చేశారు. ప్రభుత్వాన్ని స్తోత్ర గీతాలతో ప్రశంసించారు. ఆందోళన సమయంలో పొరపాటున నోరుజారి ముఖ్యమంత్రిని ఒక మాటన్నా పెద్ద మనసు చేసుకుని క్షమించాలని వేడుకున్నారు. అందుకే, కావచ్చు  గతంలో ఎప్పుడు ఉద్యోగ  సంఘాలు ఈ స్థాయిలో సర్కార్’ దాసోహం అనలేదు అనేమాట ఉద్యోగుల నుంచి వినవస్తోందిఅయితే, ఏపీటీఎఫ్, యూటీఫ్,ఎస్టీయు, ఏపీ ఉపాద్యాయ సంఘాల నాయకులు మాత్రం  ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని నిరశిస్తూ, 30 శాతం ఫిట్మెంట్ సహా తమ డిమాండ్ల సాధన కోసం తమతో కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు, భానుమూర్తి, పాండురంగా రావు ఒక ప్రకటన విడుదళ చేశారు.అయితే, ఉద్యోగ సంఘాల నాయకులు  మాత్రం ఉపాద్యాయ సంఘాల నాయకులను ఒప్పించే, బాధ్యత (కొందరు ఉద్యోగులు  ‘కాంట్రాక్టు’ అంటున్నారు) కూడా తామే తీసుకున్నారు. సరే ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పించగలరా? లేదా? అన్నది పక్కన పెడితే, ఇప్పటికే ‘సర్కారీ’ నేతలుగా పేరుపడిన ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, సోషల్ మీడియాలో వస్తున్న, పోస్టులు, కామెంట్స్’ బట్టి తెలుస్తోంది. అంతే కాదు, ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సన్నిహత సంబంధాలను, ఇతర అనుబంధాలను అడ్డుపెట్టుకుని, ఇప్పటికి ప్రభుత్వం పైచేయి సాధించినా, ఈ మోసానికి అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల ‘సర్కారీ’ నేతలు మూల్యం చెల్లించక తప్పదని  అంటున్నారు. ఇల్లు అలక గానే పండగ రాదు ... సమయం వచ్చినప్పుడు సరైన సమాదానం చెపుతామని అంటున్నారుఆదలా ఉంటే ఏపీ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషులు, 2003లో తమిళనాడులో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి జయలిత  70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులఫై డిస్మిస్ కొరడా ఝులిపించి చెల్లించిన మూల్యాన్ని గుర్తుచేస్తున్నారు.అప్పట్లో జయలలిత , ఇలాగే  ఉద్యోగుల ఆందోళను ఉక్కు పాదంతో అణచివేశారు.. విజయ గర్వాన్ని ప్రదర్శించారు .. కానీ,, ఆ తర్వాత జరిగిన  ఎన్నికల్లో ... చిత్తు చిత్తుగా ఓడి పోయారు. తమిళనాడు అసెంబ్లీ లోని మొత్తం 234 స్థానాలకు గానూ జయలిత పార్టీ అన్నాడిఎంకే కేవలం 37 స్థానలతోనే  సరిపెట్టుకోవలసి వచ్చిందని, విశ్లేషకులు గుర్తు చేస్తునారు. మరి ఏపీలో ఏమి జరుగుతుంది? చివరకు ఏమవుతుంది? చూడాలి.

Related Posts