YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివాదాల మంత్రి

వివాదాల మంత్రి

గుంటూరు, ఫిబ్రవరి 7,
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేకపోతే ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నిద్ర పట్టదేమో! వివాదాలు ఆయనకు ఆనవాయితీగా మారాయేమో! అప్పుడు రామతీర్థాలు ఇష్యూలో వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజును కించపరిచేలా మాట్లాడడం పెను దుమారమే లేపింది. ఆనక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఢీ అన్నారు. తాజాగా పెదకాకానిలోని మల్లన్న ఆలయం ఈఓ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో కయ్యానికి సై అంటున్నారు.ఇంతకీ విషయం ఏంటంటే.. తన పేషీలో పనిచేసే ఒకరికి, తన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గతంలో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి జీతాలు వెళ్లేలా చేశారు మంత్రి. ఆయన దేవాదాయశాఖ మంత్రి కదా..! తన పనివాళ్లకు ఆలయాల నుంచే జీతాలు ఇప్పించాలనుకున్నట్లురాయాన. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటిని నిలిపివేయించారు. తాజాగా గుంటూరు జిల్లా పెదకాకాని మల్లన్న సన్నిధిని ఆధిపత్య పోరుకు వేదికగా మార్చారు వెల్లంపల్లి.అప్పుడు ఆర్కేతో, ఇప్పుడు పెదకాకాని ఎమ్మెల్యే కిరారి రోశయ్యతోనూ మంత్రి వెల్లంపల్లి కయ్యానికి కాలుదువ్వారు. తన పేషీలో, ఇంట్లో పనిచేసేవారికి మంగళగిరి ఆలయం నుంచి జీతాలు వెళ్లకుండా ఆర్కే నిలిపివేయించారు. ఆలయం ఈఓ పానకాలరావును వెళ్లిపోవాలని కూడా ఎమ్మెల్యే ఆర్కే ఆదేశించారు. అప్పటి నుంచీ పానకాలరావు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.  తర్వాత పెదకాకానిలోని మల్లన్న ఆలయం నుంచి ఆ నలుగురికి జీతాలు చెల్లించాలని ఈఓను మంత్రి పేషీ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా అడ్డుకున్నారు. ‘నా ఆదేశాలే ధిక్కరిస్తావా?’ అంటూ మల్లన్న ఆలయం ఈఓపై మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే ఇవ్వొద్దంటే నేనేం చేయాలంటూ ఈఓ చేతులెత్తేశారట. తర్వాత ఇటీవల ఒకసారి సీఎం కార్యక్రమంలో ఎదురుపడిన మంత్రి వెల్లంపల్లి- ఎమ్మెల్యే రోశయ్య మధ్య మాటల యుద్ధమే జరిగిందంటున్నారు.ఈ క్రమంలోనే తన వర్గీయుడైన పానకాలరావును పెదకాకాని మల్లన్న ఆలయం ఈఓగా నియమించి, అక్కడ పనిచేస్తున్న ఈఓ శ్రీనివాసరెడ్డిని ట్రాన్స్ ఫర్ చేశారు మంత్రి వెల్లంపల్లి. తన ఆదేశాలను ధిక్కరించాడనే సాకుతో శ్రీనివాసరెడ్డిపై బదిలీ వేటు వేశారాయన. అయితే.. గత జనవరి 20వ తేదీన ఉత్తర్వుల కాపీతో మల్లన్న ఆలయానికి వచ్చిన పానకాలరావును విధుల్లో చేరొద్దని ఎమ్మెల్యే కిలారి హెచ్చరించారు. ఈ విషయం కూడా తన పేషీకి చేడంతో మంత్రి వెల్లంపల్లిలో ఆగ్రహం కట్టలు తెంచుకుందట. అంతే ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఆంజనేయస్వామి ఆలయం ఈఓగా శ్రీనివాసరెడ్డి పనిచేసినప్పుడు అవకతవకలు జరిగాయంటూ సస్పెండ్ చేశారు. తనకు అనుకూలంగా ఉండే పానకాలరావుకు లైన్ క్లియర్ చేసేందుకే శ్రీనివాసరెడ్డిని వెల్లంపల్లి సస్పెండ్ చేశారంటున్నారు.నిజానికి పెదకాకాని మల్లన్నస్వామి దేవస్థానం ఈఓ పోస్టింగ్ వ్యవహారంపై అధికార వైసీపీ నేతల మధ్య పంతాలు, పట్టింపులకు సెంటర్ పాయింట్ అవుతోంది. ఆలయం ఈఓగా తన వర్గీయుడంటే తన వర్గీయుడే ఉండాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు పంతం పడుతున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే పంతాల మధ్య ఏడాది కాలంలో నలుగురు ఈఓలు మారిపోవాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి.

Related Posts