YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో చేతి వేళ్లు కలవడం కష్టమేనా

తెలంగాణలో చేతి వేళ్లు కలవడం కష్టమేనా

హైదరాబాద్, ఫిబ్రవరి 7,
కాంగ్రెస్‌లో కుంపట్లు మరింత రాజుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఒకరి వెనుక ఒకరు.. వ్యతిరేకత జెండా ఎగురవేస్తూనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా జట్టు కడుతున్నారు. మొన్నటి వరకు కొంత వరకు కలిసి వచ్చిన నేతలు మళ్లీ వేరవుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్లు కూడా గాంధీభవన్‌కు దూరమయ్యారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్‌కు మిగిలిన నేతలు సహకరిస్తే పార్టీ బలపడుతుందనే ఆశలు ఉన్నప్పటికీ.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీ సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అందినప్పటి నుంచీ నేతల సహకారం దొరకడం లేదు. ముందు నుంచే ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వంటి నేతలు ఎదురుతిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మల్లు రవి, షబ్బీర్ ఆలీ, దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, సీతక్క లాంటి వారు రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో భట్టి విక్రమార్క సైతం రేవంత్‌కు దూరమయ్యారు.అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ ప్రోగ్రామ్‌తో జగ్గారెడ్డి ఫైట్ మొదలైంది. రేవంత్‌ని మార్చమని సోనియాకు జగ్గారెడ్డి లేఖ రాయడం, చిన్నారెడ్డి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ జగ్గారెడ్డిని వివరణ కోరుతామని అనడం.. గొడవను మరింత పెద్దది చేసింది. అంతేకాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ఆధ్వర్యంలో జూమ్‌లో జరిగిన పీఏసీ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. అప్పుడు జగ్గారెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా మద్దతుగా నిలిచారు.రేవంత్‌‌‌‌కి తొలి రోజుల్లో మద్దతుగా నిలిచిన టీపీసీసీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ దూరమయ్యారు. అటు హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్టీలో ఉన్నారా.. లేరా అన్నట్టే ఉంది. ఇప్పటి వరకు గాంధీభవన్‌కు వచ్చిన సందర్భాలు లేవు. పార్టీ కార్యక్రమాలతో పాటుగా రేవంత్రెడ్డి మీటింగ్‌లకు కూడా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేల్లో సీతక్క ఒక్కరే రేవంత్‌‌‌‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు పీసీసీ అనుబంధ విభాగాలు కూడా చీలిపోయాయిఇటీవల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించగా.. మెదక్ పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గైర్హాజరు కావడంతో నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ సమీక్షకు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా కూడా హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. దామోదర రాజనర్సింహ కూడా కొంత కాలంగా రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుండగా.. సమీక్షకు ఆయన రాకపోవడంతో మరింత బలం చేకూర్చినట్టైంది.పార్టీ ఎమ్మెల్యేలు కూడా గాంధీభవన్‌కు రావడం లేదు. కొన్ని సమావేశాల్లో సీతక్క ఒక్కరే కనిపిస్తున్నారు. అటు పొడెం వీరయ్య, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి దాదాపుగా కనిపించడమే లేదు. ఇక భట్టి విక్రమార్క మాత్రం సీఎల్పీకే పరిమితమవుతున్నారు. పలు అంశాల్లో రేవంత్రెడ్డితో కాకుండా సొంత ఎజెండాను ముందుకు తెస్తున్నారు.మరోవైపు ఇటీవల రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ సీనియర్లు పెద్దగా స్పందించలేదు. కొన్ని జిల్లాల్లో అనుబంధ సంఘాలకు చెందిన కొంతమంది లీడర్లు మాత్రమే పాల్గొని ముగించారు. అటు గజ్వేల్‌కు వెళ్లి రేవంత్రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొనగా.. మెదక్ ఉమ్మడి జిల్లా నేతలెవ్వరూ రాలేదు. దీంతో పార్టీలో నేతల మధ్య వార్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts