YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీ సీఎంల ఆస్తులు, ఆయుధాలు

యూపీ సీఎంల ఆస్తులు, ఆయుధాలు

లక్నో, ఫిబ్రవరి 7,
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలువురు నేతలు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. అదే సమయంలో ఈ నాయకులు తమ వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటో కూడా ఎన్నికల కమిషన్‌కు వివరించారు. అదే సమయంలో యూపీలో హైసెక్యూరిటీలో నడుస్తున్న ఐదుగురు మాజీ సీఎంలకు కూడా ఆయుధాలంటే ఇష్టమే కావడం విశేషం. మరోవైపు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన వద్ద ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల అధికారికి అందించారు. తన వద్ద రివాల్వర్‌తోపాటు ఓ తుపాకీ ఉందని తెలిపారు. అదే సమయంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తేల్చి చెప్పగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తన వద్ద ఆయుధం ఉందని వెల్లడించారు. అయితే యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్‌కు ఆయుధాలంటే అంతగా ప్రీతి లేక పోవడం విశేషం.ఇటీవలే గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన యోగి ఆదిత్యనాథ్ తన వద్ద లక్షా 80 వేల చేసే రివాల్వర్, రైఫిల్ ఉందని ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు తన అఫిడవిట్‌లో మొత్తం రూ.1 కోటి 55 లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా రాష్ట్ర మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి వద్ద రివాల్వర్ ఉందని వెల్లడించారు. గత ఎన్నికల్లో ఆమె ఎన్నికల కమిషన్‌లో ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.అదే సమయంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని తెలిపారు. ములాయం సింగ్ మూడుసార్లు యుపీ సిఎంగా ఉన్నారు. ప్రస్తుతం మెయిన్‌పురి నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ములాయం సింగ్ లాగే ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ వద్ద కూడా ఎలాంటి ఆయుధం లేదని తెలిపారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రంలో సీఎంగా ఉన్న అఖిలేష్ యాదవ్ వద్ద కూడా ఎలాంటి ఆయుధం లేవు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అయితే గత ఎన్నికలకు ఈ ఇప్పటకి అఖిలేష్ యాదవ్ సంపద మాత్రం పెరిగింది. కానీ అతను కూడా బ్యాంకులో అప్పులు ఉన్నట్లుగా వెల్లడించాడు.అదే సమయంలో యుపీలో ప్రస్తుత సీఎం, మాజీ సీఎం ఎన్నికల పోరులో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అదే సమయంలో, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారిగా మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. కాగా సీఎం యోగి కూడా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Related Posts