YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ దూకుడేనా

కేసీఆర్ దూకుడేనా

హైదరాబాద్, ఫిబ్రవరి 7,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ మర్యాద మరిచారా? జాతీయ రాజకీయాల్లో,తనకంటూ ఒక స్థానం, గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందుకోసంగా, బీజేపీ,మోడీ వ్యతిరేక శక్తులలో,  ‘నేను సైతం’  నిజంగానే మోడీని వ్యతిరేకిస్తున్నాను అనే ‘విశ్వాసం’ కలిగించేందుకే, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను ఉపయోగించుకున్నారా? అందుకే, ప్రధాని పర్యటన సందర్భంగా పాటించవలసిన ప్రోటోకాల్ నిబంధనలను, రాజ్యాంగ విధులను బహిష్కరించారా? ఆ విధంగా ‘నిరసన’ తెలిపారా? అంటే, తెరాస నాయకులు సహా రాజకీయ పండితులు అందరూ అవుననే అంటున్నారు.ముఖ్యమంత్రికి జ్వరం వచ్చింది, అదుకే ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం  పలకలేదు, ఆయన వెంట ఇక్రిసాట్. ముచ్చింతల్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, అని లీకులు అల్లినా అది ఎవరూ నమ్మడం లేదు. నవ్వుకుంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రధాని మోడీ పర్యటనలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకు  ‘డుమ్మా’ కొట్టారు అనే దానికి, ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి అధికారిక వివరణ ఇచ్చినట్లు లేదు. బహుశా, అలా వివరణ ఇవ్వక పోవడం కూడా, ‘నిరసన’ లో భాగమో, ఏమో ఎవరికీ తెలియదు.  అయితే,ముఖ్యమంత్రి ఎందుకోసం అయితే, జ్వరం తెచ్చుకున్నారో, ఎందుకు ‘రిస్క్’ తీసుకున్నారో ఆ ఫలితం అయినా దక్కిందా అంటే, అదీ లేదని అంటున్నారు. ప్రధానివి కురచ బుద్దులని దెప్పిపొడిచిన ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజ్యంగ విధులను విస్మరించడమే కాకుండా, దైవ కార్యాన్ని ఉపేక్షిచడం విమర్శలకు అవకాశం  కలిపించిందని తెరాస నాయకులే అంటున్నారు.”ముఖ్యమంత్రి ఒకే మాట మీద ఉంటె అదో రకంగా ఉండేది.అలా కాకుండా ఒకసారి వెలుతున్నారని, ఒక సారి లేదని ద్వంద వైఖరి చూపడం వలన జనంలో పలచని పోయాం” ని తెరాసనాయకుడొకరు అన్నారు. నిజానికి, కేంద్రంఫై యుద్ధం ప్రకటించడం, అంతలోనే యూ టర్న్ తీసుకోవడం వల్లనే జాతీయ స్థాయిలో ఎవరూ కేసీఆర్’ను అంట సీరియస్ గా తీసుకోవడం లేదని తెరాస వరగాల్లోనే చర్చ జరుగుతోంది.  మరో వంక రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ముచ్చింతల్’లో  ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల వేదికను చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. తిరునామాలు, దీక్షా వస్త్రాలతో..సమతామూర్తి క్షేత్రంలో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు ప్రధాని మోడీ అడుగడుగునా ఆధ్యాత్మిక స్పూర్తితో కనిపించారు.ఇలా వేషధారణ మొదలు, ప్రవచనంలా సాగిన  ప్రసంగం వరకు, అందరినీ ఆకట్టుకునే విధంగా మోడీ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. చివరకు, కేసీఆర్  తమ ఆధ్యాత్మిక గురువుగా బావించే చిన జీయర్ స్వామి,  ప్రధాని మోడీని ఏకంగా శ్రీ రామ చంద్ర ప్రభువుతో రాముడితో పోల్చారు. రామునిది లోనో సుగుణాలు అన్నీ మోదీలో ఉన్నాయని అన్నారు. అయోధ్య రాముడు తల వంచుకున్నప్పుడైనా.. తల ఎత్తుకున్నప్పుడైనా ధర్మాన్ని ఆశ్రయించే ఉన్నాడని, మోడీ కూడా అలాంటి రాముడేనంటూ ఆనందం వ్యక్తం చేశారు. అదలా ఉంటే, మోడీని అవమానించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని అనుకోవడం అంత శ్రేయస్కరం కాదని, బీజేపీయేతర పార్టీల నాయకులు కూడా అంటున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్  గాంధీ, ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ మోడీ లక్ష్యంగా చేసిన ప్రచారం బూమ్రాంగ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆదేబాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ  ఇప్పటివరకు కోలుకోలేదని, రాహుల్ రాజీనామాకు,మూడేళ్ళుగా పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోలేని స్థితికి,అదే కారణమని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, తగ్గేదేలే’ అంటూ మోడీ ఫై యుద్హాన్ని ముందుకు తీసుకుపోయే దిశలోనే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ఈనెల (ఫిబ్రవరి) 11 నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన  అన్యాయాన్ని ఎండగట్టడమే కేసీఆర్ జిల్లా పర్యటనల లక్ష్యమని తెరాస నాయకులు చెపుతున్నారు. మరో వంక బీజేపీ కూడా, కారును ‘ఢీ’ కొనేందుకు రె...ఢీ అంటోంది. మొత్తానికి రాష్ట్రంలో ఎండలతో పాటుగా రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా వేదక్కనున్నాయి అనేది నిజం.

Related Posts