YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిఐటీయూ నిరసన

సిఐటీయూ నిరసన

విశాఖపట్నం
పిఆర్సి  ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు తలపెట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జరిగిన అరెస్టులు ఉద్రిక్త వాతావరణం తలపించాయి. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన ఒప్పందాలు తమకు అన్యాయం జరిగిందని పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు. దీంతో ఒక్కసారిగా జీవీఎంసీ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపైకి వచ్చి బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో అక్కడే మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంత సేపు పారిశుద్ధ్య కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో అర్ధరాత్రి జరిగిన చర్చల్లో ఉద్యోగులను భయపెట్టి చీకటి ఒప్పందాలు చేశారని ఆరోపించారు. ఈ ఒప్పందాలు వలన ఉద్యోగ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, జరిగిన చర్చల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడలేదని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు పెంచడం గాని అమలు చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు తమకు సక్రమంగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts