YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే..

టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే..

తిరుపతి ఫిబ్రవరి 7
చిత్తూరు జిల్లాలో పుష్ప సీన్‌ వెలుగు చూసింది. ఎర్రచందనం స్మగ్లర్లు పుష్ప  సినిమా చూసి కొత్త ఐడియాలకు తెరతీశారు. అక్కడ హీరో తగ్గేదేలే అంటే.. అంతా విజిల్స్‌ వేశారు. కాని ఇక్కడ పుష్ప కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చంద్రగిరిలో టమాటా రవాణా ముసుగులో ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్‌కు దిగాడు ఓ దుండగుడు. పుష్ప సినిమాలో పాల వాహనంలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసినట్లు.. ఇక్కడ టమాటా రవాణా ముసుగులో ఇలా చేశాడు. ట్రాలీలో కింద ఎర్రచందనం దుంగలను ఉంచి.. పైన టమాటా ట్రేలు పెట్టాడు. చెకింగ్‌ పాయింట్‌ దగ్గర పోలీసులకు అనుమానం రాకుండా చూసుకున్నా.. చివరికి దొరికిపోయాడు. మొత్తం 14 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లగేజీ వాహనంతో సహా దుంగలను చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్మగ్లర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.కాగా  ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ క్వాలిటీ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.  జపాన్, చైనా, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. చైనా, జపాన్‌లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు.  విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

Related Posts