YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమోడీ జ్వరం

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమోడీ జ్వరం

హైదరాబాద్ ఫిబ్రవరి 7
సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శంషాబాద్ కు రావటం.. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గైర్హాజరు కావటం తెలిసిందే. ఎందుకిలా? అంటే..
ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వల్ప జ్వరం వచ్చిందని.. అందుకే రాలేదని పేర్కొన్నారు. శనివారం జ్వరంతో బాధ పడిన ఆయన.. ఆదివారం యాక్టివ్ గా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఈ రోజు (సోమవారం) యాదాద్రికి బయలుదేరి వెళుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన పెద్ద మనిషికి.. అప్పుడే జ్వరం.. నీరసం తగ్గిపోవటం.. ఆ వెంటనే యాదాద్రికి టూర్ పెట్టేయటం గమనార్హం. సోమవారం ఉదయం 11 గంటల వేళలో రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోనున్న సీఎం కేసీఆర్.. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించనున్నారు.
అంతేకాదు.. అత్యంత భారీగా.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పున: ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మహా సంప్రోక్షణను నిర్వహించనున్నారు. దీని కోసం సుదర్శన యాగం.. ఇతరత్రా ఏర్పాట్లపైనా సమీక్ష నిర్వహించారని చెప్పాలి. ఇక.. సుదర్శన యాగం సందర్భంగా 1108 యాగ గుండాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున దాదాపు ఆరు వేలకు పైగా  రుత్వికులు పాల్గొంటారని చెబుతున్నారు. యాదాద్రి పున: ప్రారంభ వేడుకుల కోసం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు.. అతిధులు.. మఠాధిపతులు.. ఇలా అందరూ రానున్నట్లు చెబుతున్నారు. ఏమైనా యాదాద్రి పనుల్ని పరిశీలించటమంటే చాలు.. సీఎం కేసీఆర్ కు ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకువస్తుందని మాత్రం చెప్పక తప్పదు.

Related Posts