YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు ఆంధ్ర ప్రదేశ్

ఈ తాతకు పాములంటే రుచికరం

ఈ తాతకు పాములంటే రుచికరం

పొరపాటున మనకు పాము కనిపించిందా.. అంతే హార్ట్ అండర్‌వేర్‌లోకి జారిపోయి అక్కడ నుంచి అర కిలోమీటర్ వరకూ ఆగకుండా పరిగెత్తుతామంతే.. అదే చైనాలో అయితేనా చక్కగా చారు పెట్టుకుని..
మంచింగ్‌లోకి మంచి మంచి ముక్కలను ఫ్రైగా చేసుకుని మరీ లాగించేస్తారు. సాధారణంగా.. ఈ పాములు తినడం గట్రా.. ఇవన్నీ మనం ఆ డిస్కవర్ ఛానల్‌లో‌నో.. చైనా సినిమాల్లోనో చూస్తుంటాం. కానీ మనదేశంలో కూడా పాములను తినేవాళ్లు ఉన్నారంటే నమ్మండీ..! ఏదో మారుమూల రాష్ట్రాలో.. పేరు తెలియని ఊర్లలో కాదండీ బాబూ.. అచ్చ తెలుగు మాట్లాడే మన ఆంధ్రప్రదేశ్‌లోనేనండీ..!!
పామును దగ్గర నుంచి చూశామంటే మనకు ఒళ్లు జలదరిస్తుంది.. అదే ఆయనకు మాత్రం ఒళ్లు పులకరించిపోతుంది.. పాములంటే ఎంత ఇష్టమంటే పచ్చి పామునే ఉప్పూ కారం పెట్టకుండా లాగించేసేంత ఇష్టమనమాట..!
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న అనే వృద్ధుడికి పాములంటే చాలా ఇష్టం. ఎంత అంటే చచ్చిన పాము కనపడితే ఎంతో కమ్మగా ఆరగించేంత..!
చాలా కాలంగా పాములు తినే అలవాటున్న పెద్ద పుల్లన్న ఆదివారం రోజు ఊర్లో చచ్చిపడిన పామును ఆరగిస్తుండటంతో కొందరు యువకులు ఆ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అంతే అది కాస్తా వైరల్ అయ్యి కూర్చోంది.. ఈయనెవరండీ బాబూ అనుకుంటా చాలా మంది కామెంట్లు కూడా చేశారని యువకులు చెబుతున్నారు. అయితే పెద్ద పుల్లన్న పాములను మాత్రం చంపడు..
ఎవరైనా చంపి పడేస్తే దాన్ని ఇష్టంగా ఆరగిస్తాడంతే..!
ఇలా పాములను తినే బ్యాచ్ గతంలో కూడా కనిపించారు. కరోనా సమయంలో తమిళనాడు రాష్ట్రంలో పాములు తింటూ ఓ వ్యక్తి వైరల్ అయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ పీక్‌లో ఉన్న సమయంలో పామును తింటే ఎవరో కరోనా రాదని చెప్పడంతో.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు అనే ఓ వ్యవసాయ కూలి మద్యం మత్తులో పామును తినేశాడు. అప్పట్లో అదో సెన్షేషన్‌గా మారింది.

Related Posts