YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సీఎం స్టాలిన్ ను కలిసిన ఎమ్మెల్యే రోజా

సీఎం స్టాలిన్ ను కలిసిన ఎమ్మెల్యే రోజా

చెన్నై
తమిళనాడు సీఎం స్టాలిన్ ను నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రత్యేకంగా కలిశారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న తమిళుల సమస్యలను విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న  విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు  మెట్రిక్యులేషన్ సిలబస్ ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతికు 1000 చొప్పున మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ నకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి,భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం – అరక్కోణం రోడ్డు NH 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరారు.
అతి ప్రధానంగా ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని కరోనా తర్వాత ప్రపంచ దేశాలు టెక్స్ టైల్స్(Textiles) ను చైనా దేశం నుండి దిగుమతి చేసుకోకపోవడం కారణంగా ప్రపంచం యొక్క వస్త్రా అవసరాలను మన దక్షిణ భారత దేశంలోని చేనేత మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా గతంలో చర్చించామని దీనిపై తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని వివరించారు.
అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివాసముంటున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరంతోనూ తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వ పరంగా అయినా, వ్యాపారపరంగా అయినా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారని, అటువంటి వారికి తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళనాడు ప్రభుత్వ పౌరుడుకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా  చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న తమిళ కుటుంబీకులకు కూడా అదే సౌకర్యాలను వర్తింపజేయాలని రోజా విన్నవించారు.

Related Posts