YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త పధకాల కోసం సర్వే

కొత్త పధకాల కోసం సర్వే

విశాఖపట్టణం, ఫిబ్రవరి 8,
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలు అందుకునే లబ్ధిదారులపై కొత్త సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నిర్వహించిన సాధికారత సర్వే స్థానంలో దీనిని నిర్వహించనున్నారని సమాచారం. మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో దీనిని నిర్వహించనున్నట్లు సమాచారం. కొత్త సర్వే నిర్వహణపై సచివాయాల కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిసింది. పథకాలు అందుకుంటున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు గతం నుంచి అధికారులు చెబుతున్నారు. ఆస్తులు ఉన్న వారు కూడా ఈ పథకంలో లబ్ది పొందుతున్నట్లు వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లబ్దిదారుల ఇళ్లకు కార్యదర్శులు, వాలంటీర్లు వెళ్లి వారి వివరాలు సమూలంగా సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా వారికున్న భూములు, దేనికైనా పన్నులు చెల్లిస్తున్నారా, వారు వినియోగిస్తున్న విద్యుత్‌ వివరాలు సేకరించనున్నారు. లబ్దిదారుల ఇళ్లలో అద్దెకు ఎవరైనా ఉంటున్నారా, ఆ ఇళ్లలో ఎన్ని విద్యుత్‌ మీటర్లు వినియోగిస్తున్నారన్నది కూడా సేకరించనున్నట్లు తెలిసింది. ఒక వేళ ఒకటికన్నా ఎక్కువ మీటర్లు ఉన్న వాళ్లు, వాటిపై ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే తమ పరిధిలోని విద్యుత్‌ శాఖ ఏఇ వద్దకు వెళ్లి వాటిని తొలగించుకోవాల్సి ఉంటురది. ఇదే సమయంలో భూమి ఉరటే ఎరత ఉరది, అది సాగుభూమా, నివాస భూమా అన్నది చెప్పాల్సి ఉరటుంది. ఉన్నా పథకాల కోసం లేదని చెబితే ఆ విషయాన్ని యాప్‌లో పొందుపరిచి, లబ్దిదారుల వేలిముద్ర తీసుకుంటారు. ఇదే సమయంలో లేదని చెప్పిన వారికి భూమి ఉన్నట్లు తరువాత కాలంలో తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ సర్వే నిర్వహణ బాధ్యతలను రెవెన్యూ, ప్రణాళిక, ఆర్ధిక, ఐటి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలపై ఉంటుందని సమాచారం. ఈ సర్వే ప్రారంభమయ్యాక ఆయా శాఖల అధికారులు సమాచారాన్ని క్రోడీకరించి, నిజమైన లబ్దిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఈ సర్వేను వాస్తవంగా ఫిబ్రవరి నెల్లోనే ప్రారంభించాలని ఆలోచన చేసినప్పటికీ యాప్‌లో తలెత్తిన కొన్నిసాంకేతిక సమస్యల కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలలకు వాయిదా వేసినట్లు తెలిసింది.

Related Posts