YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముచ్చింతల బ్యాక్ స్టెప్ పై చర్చోపచర్చలు

ముచ్చింతల బ్యాక్ స్టెప్ పై చర్చోపచర్చలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8,
ముచ్చింతల్ కు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు? కేసీఆరే వెళ్లనన్నారా? అలా అయితే వెళ్లడం లేదని డైరెక్టుగా చెప్పొచ్చు కదా. తాను డైరెక్ట్ మనిషినని డొంక తిరుగుళ్లు ఉండవని ఆయనే చెప్పారు కదా. జ్వరం వచ్చిందని, నలతగా ఉందని లీకులివ్వడం దేనికి? వాటి మీద సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు జడిసి, ప్రజలేమనుకుంటారోనన్న ఫీలింగ్ లో...  ప్రధాని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎవరికీ అర్థం కాని పిల్లిమొగ్గలెయ్యడం దేనికి? ఇందులో ఏదో మతలబున్నట్టు కనిపించడం లేదూ? సరే.. ఇక వెళ్తానన్న కేసీఆర్ వెళ్లకపోవడానికి అవతలి వైపు నుంచి ఏమైనా ఆబ్జెక్షన్ వచ్చిందా..? కరెక్ట్.. అదే నిజం, అందులోనే అసలు నిజం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేసీఆర్ వెళ్లకపోవడం కాదు... ప్రధాని మోడీనే కేసీఆర్ ను రావద్దన్నారన్న లోగుట్టు ఇప్పుడిప్పుడే లీకవుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి విషయంలో, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారి విషయంలో ప్రధాని మోడీ ఎంత నిక్కచ్చిగా ఉంటారో జనమంతా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అదే విషయాన్ని మోడీ గజ్వేల్ లో పర్యటించినప్పుడు కేసీఆర్ బహిరంగంగా చెప్పి మోడీని తెగ పొగిడారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ప్రధానితో వేదికను పంచుకోవాల్సిన కేసీఆర్ ను ప్రధానమంత్రి కార్యాలయమే   వారించిందని  పొలిటికల్ సర్కిల్స్ లో ఇంటర్నల్ టాక్ తీవ్రంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అవింకా కొలిక్కి రాలేదు. విచారణ దశలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ఉండే వెసులుబాటు ఉపయోగించుకొని పాస్ పోర్టు స్కామ్ కు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని అప్పుడప్పుడూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి ఫైర్ ఉన్న నాయకులు అప్పుడప్పుడూ ప్రజలకు గుర్తు చేస్తూంటారు. ప్రధాని ఈ విషయంలో చాలా క్లియర్ కట్ ఒపీనియన్ తో ఉన్నారు కాబట్టే.. ఆయన కార్యాలయం నుంచి కేసీఆర్ కు రావద్దన్న సమాచారం ఉందంటున్నారు తెలంగాణ రాజకీయ విమర్శకులు. మరోవైపు.. కేసీఆర్ మీద, ఆయన పరిపాలనా శైలి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ ముచ్చింతల్ రాకుండా ఉండడానికి మరో కారణమన్న అభిప్రాాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముచ్చింతల్ లో ప్రధానికి స్వాగతం పలికే కమిటీలో తీన్మార్ మల్లన్నకు చోటు కల్పించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
బీజేపీ రాష్ట్ర నేతలు తీన్మార్ మల్లన్నను ఆ కమిటీలో చాలా వ్యూహాత్మకంగానే పెట్టారంటున్నారు. బడ్జెట్ రోజున కూడా సోషల్ మీడియాను కాలబెడతామని, అదీ ఒక జర్నలిజమేనా అనీ, నువ్వొక జర్నలిస్టువా అంటూ పలు సంస్థల మీద, కొందరు జర్నలిస్టుల మీద కూడా కేసీఆర్ డైరెక్టుగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఫ్యాక్టర్ కూడా కేసీఆర్ ను ముచ్చింతల్ రాకుండా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో... బీజేపీ అధినాయకత్వం సైలెంట్ గా ఇచ్చిన కౌంటర్ తో కేసీఆర్ అండ్ టీమ్ మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇంటెలీజెన్స్ అధికారుల ద్వారా అందుకున్న సమాచారంతో  అసలు కేసీఆర్ కు నిజంగానే జ్వరమొచ్చిందంటూ ఛలోక్తులు విసురుతున్నారు రాజకీయ పరిశీలకులు.  సో... కేసీఆర్ డుమ్మా కొట్టడం కాదు..
డుమ్మా కొట్టేలా డ్రామా నడిచిందన్న విషయం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Posts