YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీలోకి యువదళం...

బీజేపీలోకి యువదళం...

హైదరాబాద్, ఫిబ్రవరి 8,
రాష్ట్రంలలో ఓ వంక అధికార తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య యుద్ధం నడుస్తుంటే, మరోవంక తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న ఉద్యమ శక్తులు బీజేపీ వైపు చూస్తున్నాయి.ఇప్పటికే, ఈటల రాజేందర్, తెలంగాణ ఉద్యోగ సంఘాల్ మాజీ నేత విఠల్, తీన్మార్ మల్లన్న మరి కొందరు ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. అదలా ఉంటే ఇప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని యువ తెలంగాణ పార్టీ.. బీజేపీలో విలీనం కానుందని సమాచరం. నిజానికి, చాలా కాలంగా, రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా, జిట్టా, రుద్రమలకు రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్’ రాణీ రుద్రమతో కాంగ్రస్ సీనియర్ నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఒక దశలో కాంగెస్’లో చేరుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటుగా జాతీయ నాయకత్వం కూడా జోక్యం చేసుకోవడంతో చివరకు జిట్టా, రుద్రమ కాషాయం వైపు మొగ్గు చూపారు. ఈ నేపధ్యంలోనే బీజేపీలో  యువ తెలంగాణ విలీనానానికి, ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న యువ తెలంగాణ పార్టీ విలీనం ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు (సోమవారం) వెల్లడించారు. బీజేపీలో యువ తెలంగాణ విలీనానికి, బీజేపీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ నెల 16న జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణీరుద్రమ సహా కీలక నేతలు కాషాయ కడువా కప్పుకుంటారని బండి సంజయ్ తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణారెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తుండగా, రాణిరుద్రమ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ టికెట్‌ కోరుతున్నట్లు సమాచారం. యువ తెలంగాణ విలీనంతో బీజేపీ బలం కొంత పెరుగుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

Related Posts