అనంతపురం
రథసప్తమిని పురస్కరించుకుని నీలకంఠాపురం దేవస్థానంలో ఉదయం యోగాసనాలు వేశారు. బిసిహాస్టల్ విద్యార్థులు ఉత్సాహంగా సూర్య నమస్కారాలు,యోగాసనాలు వేశారు. యోగాసనాలు ప్రయోజనాలను ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ సదాశివ రెడ్డి సూర్యశతకం సూర్య మంత్రాలను విద్యార్థులతో వేయించారు. సూర్యుడుని పూజించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణయజుర్వేదం కూడా వివరిస్తుంది.ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని, సవితృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని,పూష్ణరూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి.సూర్య నమస్కారాల గురించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు.వీటిని బ్రహ్మ ముహుర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నారు