YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి

జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి

అమరావతి
రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం  విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును  జమ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ఫీజు రియంబర్స్ మెంట్ ను గతంలో నీరు గార్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం జరగలేదన్నారు. బీసీలంటే కేవలం పనిముట్లు కాదన్నారు. బీసీలంటే సమాజానికి బ్యాక్ బోన్ లాంటివాళ్లన్నారు. తన పాదయాత్రలో వీరి కష్టాలను దగ్గరగా చూశానన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచామని అన్నారు. రెండేళ్లలో రూ.583కోట్లు ఇచ్చామన్నారు. ఈ దఫాలో లక్షా 46వేల మంది టైలర్లకు రూ.146కోట్లు, 98వేల మంది రజకులకు రూ.98కోట్లు,40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40కోట్లు , షాపులున్న ప్రతి ఒక్కరికి ఏటా రూ.పది వేల సాయం, జగనన్న చేదోడు కింద 2.85లక్షల మందికి నగదు జమ చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈనాడు  రామోజీ రావు,  అంధ్రజ్యోతి రాధాకృష్ణలపై సీఎం మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లో మీడియాకు పండగ. సంధి జరిగింది...ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంలేదని వారికి మంట అని ఆరోపించారు. ఉద్యోగులు సమ్మె విరమించారు అనగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారు. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి, రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి రాధాకృష్ణకు ఆత్మీయుడని వ్యాఖ్యానించారు. బీసీలు జడ్జీలుగా  పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడని అన్నారు.

Related Posts