YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు

మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 9,
రాష్ట్ర బడ్జెట్ తయారీ ముమ్మరంగా జరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖల నుంచి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అందాయి. రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలను కూడా వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను అధ్యయనం చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఈసారి సుమారు రూ. 35 వేల కోట్ల మేర సెంటర్ నుంచి గ్రాంట్లు, డివొల్యూషన్ రూపంలో అందవచ్చని అంచనా వేశారు. కేంద్ర బడ్జెట్ వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. మరోవైపు అన్ని శాఖల కార్యదర్శులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రెండు దఫాలుగా సమావేశాలను నిర్వహించారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ స్పీచ్ కాపీ కోసం కొన్ని శాఖల నుంచి ముసాయిదా అంశాలు కూడా ఇప్పటికే అందాయి. అన్ని శాఖల నుంచి వచ్చిన తర్వాత క్రోడీకరించి పూర్తిస్థాయి స్పీచ్ కాపీ తయారుకానున్నది.ప్రస్తుత బడ్జెట్ సుమారు రూ. 2.30 కోట్లు ఉన్నందున రానున్న ఆర్థిక సంవత్సరానికి అది రూ. 2.75 కోట్లు దాటవచ్చని ప్రాథమిక అంచనా. ఇందులో రూ. 20 వేల కోట్లు దళితబంధు పథకానికే కేటాయించే అవకాశం ఉన్నది. వివిధ శాఖల్లో ప్రస్తుతం అమలవుతున్న చిన్న పథకాలను ఈసారి బడ్జెట్‌లో పెద్దగా కనిపించకపోవచ్చని ఆర్థికశాఖ వర్గాల సమాచారం. వ్యవసాయ రంగంలో విత్తన సబ్సిడీ, యాంత్రికీకరణ, పంటల బీమా లాంటివాటికి పెద్దగా కేటాయింపులు ఉండవని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటివి యథావిధిగా కొనసాగనున్నాయి.దళితుల కోసం ఈసారి దళితబంధు పథకాన్ని ప్రభుత్వం బాగా ప్రొజెక్ట్ చేస్తున్నందున బీసీలకు సైతం అదే తరహా భారీ స్కీమ్ ఈ బడ్జెట్‌లో ఉండొచ్చని ఆర్థికశాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. అయితే వాటికి ఎంత మొత్తంలో కేటాయింపు చేయాలనేది ఆ శాఖ నుంచి వచ్చే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి అమలవుతున్న గొర్రెలు, చేపపిల్లల పంపిణీ లాంటి పథకాలు కూడా యథావిధిగా కంటిన్యూ కానున్నాయి. వీటికి అదనంగానే ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరే కొత్త పథకాన్ని ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.అన్ని శాఖల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి బడ్జెట్‌లో ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసే పని జరుగుతున్నది. దానికి తగినట్లుగా ఆదాయ వనరులను ఎలా సమకూర్చుకోవాలనేది కూడా ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈసారి భూముల అమ్మకం (నాన్ టాక్స్ రెవెన్యూ) ద్వారా భారీ స్థాయిలోనే సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం ద్వారా కూడా ఆదాయం పెరగవచ్చని అనుకుంటున్నది. ఎక్సయిజ్ (మద్యం) ఆదాయం కూడా గణనీయంగా పెరగనున్నది. మొత్తంగా బడ్జెట్ సైజు రూ. 2.75 లక్షల కోట్లు దాటవచ్చని ప్రాథమిక అంచనా.బడ్జెట్ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలనేది ఇంకా చర్చకు రానప్పటికీ మార్చి మొదటి వారంలో మొదలై కనీసంగా పది రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నది. మార్చి 21న మహా సుదర్శన యాగంతో మొదలై యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం పనులు జరగనున్నందున అప్పటికల్లా అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉన్నది. దానికి తగినట్లుగానే బడ్జెట్ తయారీ జరుగుతున్నది. చాలా శాఖల్లోని చిన్నచిన్న పథకాలకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు కష్టమే

Related Posts