YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కి మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కి మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

జగిత్యాల, ఫిబ్రవరి 09
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని పార్లమెంట్ లో భారత ప్రధానమంత్రి మోదీ తప్పు పట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి మోదీ క్షమాపణలు చెప్పాలని. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుంచి తహశీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల తహశీల్ చౌరస్తాలో డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్  కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను  కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులు, యువకుల బలిదానలను నిలువరింప జేయడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ప్రజలకిఛ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సమాంజసం కాదన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని తెలిసి కూడా  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహాసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇఛ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ప్రకటీంచిందని తెలిపారు.సాధించుకున్న తెలంగాణలో ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందిందే తప్పా నిరుద్యోగులు, యువకులు ఉపాధి అవకాశాలు లేక   ఇబ్బందులు పడుతున్నారని,  అలాగే తెలంగాణలోని  ప్రజలను కేసీఆర్ పట్టించుకోలేదని లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరువాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్ లు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలా, అన్ని వర్గాలకు మేలు జరుగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళేపెల్లి దుర్గయ్య టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి బంబ శంకర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దళితులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్ లో నిధులు కేటాయించిందని దుర్గయ్య గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కౌన్సిలర్ నక్క జీవన్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు,కాంగ్రెస్ నాయకులు  గాజుల రాజేందర్, పులి రామ్, కోర్టు శ్రీను, అల్లాల రమేష్ రావు, అశోక్, బీరం రాజేష్,నేహాల్,చందా రాధా కిషన్,పాషా,కమాల్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts