అమరావతి
చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున మూడు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం ముందు ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణ జరిపింది. ఇంప్లీడ్ పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసిన హై కోర్ట్, 100 లేక 200 పిటిషన్లు వేస్తారా అని ప్రశ్నించింది. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా అని ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించింది. తాము కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర విన్నవించారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు. కన్యాశుల్కం నాటకములో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా అని ప్రశ్నించారు. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించ మంటే ఎలా అని అన్నారు. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని అన్నారు. ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలీ అయింది. తరువాత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది