YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ రెడ్డి సర్కార్ అప్పు పుట్టినా... ఓవర్ డ్రాఫ్ట్ క్రిందా చెల్లు...

జగన్ రెడ్డి సర్కార్ అప్పు పుట్టినా... ఓవర్ డ్రాఫ్ట్ క్రిందా చెల్లు...

విజయవాడ, ఫిబ్రవరి 10,
జగన్ రెడ్డి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ను నిండా అప్పుల్లో ముంచేసింది. ఇంకా ఎడా పెడా అప్పులు చేస్తూనే ఉంది. సెక్యూరిటీల వేలంలో 2 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నా ఏపీ చేతికి చిప్పే మిగిలింది. ఆ మొత్తం సొమ్మంతా ఓవర్ డ్రాఫ్ట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే జమ చేయాల్సి వచ్చింది. గడచిన ఆరు వారాల్లో ఏపీ 4 వేల 500 కోట్ల రూపాయల అప్పుగా తీసుకుంది. అయినా కాసుల కోసం ఏపీ సర్కార్ ఎక్కని మెట్టూ లేదు.. దిగని గుమ్మం లేదు. తప్పుడు మార్గాల్లో అప్పుల మీద అప్పులు చేస్తున్న జగన్ రెడ్డి సర్కార్ కు ఎన్ని కోట్లు అప్పులు దొరికినా ఇంకా చాలడంలేదు. ఇంకా.. ఇంకా కావాలంటూ ప్రతిచోటా దేబిరిస్తూనే ఉంది. ‘మాకు అప్పులు ఇవ్వండి.. అదనపు అప్పులకు అనుమతి ఇవ్వండి.. మా అప్పులకు అడ్డు లేకుండా చూడండి’ అంటూ జగన్ రెడ్డి సర్కార్ కేంద్రం ముందు ప్రతి క్షణమూ మోకరిల్లుతూనే ఉందివాస్తవానికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు 27 వేల 325 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరారు. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా జగన్ రెడ్డి సర్కార్ అప్పుల కోసం వెంపర్లాడుతూనే ఉంది. అలా చేసిన అప్పుల అసలు, వడ్డీలు చెల్లించేందుకే రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదట. రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అండ్ కో అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం.. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.2021-22లో 42 వేల 472 కోట్లు అప్పు చేసుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. గడిచిన మూడేళ్లలో కేంద్రం అనుమతించిన దాని కంటే 17 వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తెచ్చేసింది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ 17 వేల కోట్లకు కోత వేసి  25 వేల 472 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించిందట. ఒక్కసారిగా అంత మొత్తాన్ని కోత పెడితే భరించలేవమని, దాన్ని మూడేళ్లకు సర్దుబాటు చేయండి మహాప్రభో అంటూ కేంద్రాని రాష్ట్రం కోరింది. రాష్ట్రం వినతికి కేంద్రం ఓకే అందో లేదో స్పష్టత లేదు. అయితే.. జగన్ రెడ్డి సర్కార్ యధేచ్ఛగా అప్పులు చేసుకోడానికి కేంద్రం చేయూతనిస్తోందంటున్నారు. ఇంతవరకు తెచ్చిన అప్పులు చాలవన్నట్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల కోసం అదనంగా 27 వేల 325 కోట్ల అప్పు కావాలంటూ జగన్ సర్కార్ అడగడం చర్చనీయాంశంగా మారిందివైసీపీ సర్కార్ ఏ రూపంలో రుణం తీసుకోవాలని యత్నించినా అవాంతరాలు ఎదురవుతున్నాయట. విద్యుత్ రంగ సంస్కరణల కోసం అదనంగా 2 వేల 133 కోట్ల రూపాయలు అదనంగా అప్పుగా తీసుకునేందుకు పది రోజుల క్రితం కేంద్రం అనుమతించింది. దీంతో మంగళవారంనాడు సెక్యూరిటీల వేలంలో పాల్గొంది. రెండు వేల కోట్లు రుణాలుగా తీసుకుంది. ఖజానా వసూళ్లకు మించి నిధులను ఆర్బీఐ వద్ద ఏపీ వాడుకున్నందున ఆ మొత్తం 2 వేల కోట్లూ ఓడికే సర్దుబాటు చేయాల్సి వచ్చిందని సమాచారం. రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ దారుణంగా ఉండడంతో 7 పాయింట్ 37 శాతం అత్యధిక వడ్డీకి సెక్యూరిటీలను జగన్ రెడ్డి సర్కార్ వేలం వేసింది.రాష్ట్ర రాబడికి మించి ఖర్చు ఉన్నప్పుడు.. అప్పులు తీసుకునేందుకు ఆర్బీఐ పలు రకాలుగా అనుమతిస్తుంది. వాటిలో వేస్ అండ్ మీన్స్ రూపంలో నిధులు సమకూర్చుకోవచ్చు. ఆ పరిమితి మించిపోతే ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం ఉంటుంది. ఓడీ కోటాలో తీసుకున్న నిధులన్నీ సంబంధిత వడ్డీతో తిరిగి ఆర్బీఐకి చెల్లించాలి. ఇది కూడా ఓ రకమైన అప్పు లాంటిదేనట.ఇలా ఉండగా.. ఏపీలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జగన్ రెడ్డి సర్కార్ ఏపీని రోజు రోజుకూ అప్పుల ఊబిలో ముంచేస్తున్నారంటూ టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన అప్పులు చాలక జగన్ రెడ్డి సర్కార్ రాజధానిగా వద్దనుకున్న అమరావతి భూముల్ని కూడా తాకట్టు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో రోడ్ల పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా గోతులు, గుంతలు, రాళ్లమయం చందంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళల్లో ఏ ఒక్క రోడ్డుపైనా కనీసం గుంతలు పూడ్చ లేదని నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ జనం నెత్తిన ఎన్ని వేల కోట్ల అప్పు పెట్టినా కనీస వసతులు కల్పించడం లేదని ఫైరవుతున్నారు. ఉత్పాదక రంగంపైన కాకుండా పప్పు బెల్లాల్లా కొందరికే దోచిపెట్టడం వల్లే రాష్ట్రంలో ఇప్పుడు ఇలా ఆర్థిక దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ చేతకాని దద్దమ్మ సర్కార్ కు సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతామంటూ గుర్రుగా ఎదురు చూస్తున్నారు.

Related Posts