YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మీడియా మీట్లతోనే సరా...

మీడియా మీట్లతోనే సరా...

గుంటూరు, ఫిబ్రవరి 10,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలిన ఆశిస్తున్నారు. ఈసారి అధికారం దక్కకపోతే పార్టీ మనుగడ కష్టమే. అందుకే చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సమాయత్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పించి విపక్షంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు యాక్టివ్ గా ఉండేవి. తెలుగు మహిళ, తెలుగు యువత, తెలుగు రైతు, టీఎన్టీయూసీ ఇలా అనేక సంఘాలు ఫుల్లు యాక్టివ్ గా ఉండేవి. వాటి జాడ ....? అయితే ప్రస్తుతం అనుబంధ సంఘాల జాడ లేదనిపిస్తుంది. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత ఉన్నా ఆమె మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న జాడ లేదు. ఇటీవల నారీ దీక్ష పేరుతో కొంత హడావిడి చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేవలం మహిళ సంఘం పార్టీ ఉందంటే ఉన్నట్లు ఉంది. ఇక తెలుగు యువత కూడా అదే పరిస్థితి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ ను నియమించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువనేత తొలినాళ్లలో చేసిన హడావిడి ఇప్పుడు కన్పించడం లేదు. తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన వాయిస్ పార్టీలో పెద్దగా విన్పించదు. రైతు సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాలను పార్టీ చేపట్టినా తెలుగు రైతు సంఘం యాక్టివిటీ ఎక్కడా కన్పించకపోవడం విశేషం. ఇక తెలుగు విద్యార్థి విషయం చెప్పనక్కర లేదు. అది ఉందా? లేదా? అన్న డౌటు పార్టీ నేతలకే కలుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఏ కార్యక్రమం చేయాలన్నా అనుబంధ పార్టీ నేతలు, కార్యవర్గం తరలి వచ్చేది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కావడంతో గ్రామ స్థాయిలో పార్టీకి క్యాడర్ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు బయట నుంచి కూలీకి తీసుకురావాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా పట్టుమని పది మంది రాకపోవడానికి కారణం పార్టీ అనుబంధ సంఘాలు బలహీనంగా ఉండటమేనన్న వాదన పార్టీలో విన్పిస్తుంది. ఈ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడానికి చంద్రబాబు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నేతలనే నమ్ముకున్నారు. ఇప్పటికైనా అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలన్న సూచనలు విన్పిస్తున్నాయి.

Related Posts