YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఇక పెరగనున్న ఇళ్ల ట్యాక్సులు

ఇక పెరగనున్న ఇళ్ల ట్యాక్సులు

హైదరాబాద్, ఫిబ్రవరి 10,
సర్కార్ నుంచి జీహెచ్ఎంసీకి ఒక్క రూపాయీ అందకపోవడంతో అప్పుల  భారాన్ని జనంపై మోపి,  ట్యాక్స్ రూపంలో  డబ్బులు గుంజేందుకు రెడీ అయ్యింది. ప్రాపర్టీ ట్యాక్స్ను పెంచి,  బ్యాంక్బ్యాలెన్స్ ఫుల్ చేసుకొనేందుకు బల్డియా ప్లాన్ చేస్తోంది. ఇందుకు సర్కారు పర్మిషన్ కోసం  వేచి చూస్తోంది.  ప్రభుత్వం ఒకే అంటే  వచ్చే ఆర్థిక ఏడాది నుంచే  కొత్త పన్నును వసూలు చేయడానికి ఆఫీసర్లు రెడీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలను  కౌన్సిల్ ముందు  పెట్టి ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో ఆర్థిక ఇబ్బందులు  ఉన్నాయని బల్దియాను గట్టెక్కేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  అప్పులకు వడ్డీలు చెల్లించలేని స్థితికి చేరకుంటుండటంతో ఇతర మార్గం లేక ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 15 ఏండ్లుగా బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచలేదు. దీంతో  40 నుంచి 50 శాతం ట్యాక్స్ ను  పెంచేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది.గ్రేటర్ పరిధిలో  రెసిడెన్షియల్, కమర్షియల్, ఓపెన్ ల్యాండ్స్ కేటగిరీల్లో ట్యాక్స్ పే చేసేవారు 17 లక్షల మంది ఉన్నారు. ఇందులో  ఓపెన్ ల్యాండ్లకు మార్కెట్ వ్యాల్యూలో 0.50 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ ను ఏటా వసూలు చేసుకుంటుండగా, రెసిడెన్షియల్ భవనాలకు 60 పైసల నుంచి రూ1.20 వరకు, అదేవిధంగా  కమర్షియల్ బిల్డింగ్లకు మినిమమ్ ఒక్క రూపాయి నుంచి  గరిష్ఠంగా  రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. ఏరియాని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా బల్దియా ట్యాక్స్ వసూలు చేస్తోంది. అత్యధికంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది.  పన్ను పెరిగితే ట్యాక్స్ కౌంట్లో భారీ మార్పులు రానున్నాయి. లంగర్హౌస్ లాంటి సాధారణ  రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వంద గజాల స్థలంలో ఉన్న ఇంటికి ప్రస్తుతం రూ.11వేలు చెల్లిస్తుండగా,  ట్యాక్స్ పెరిగితే రూ.16 వేలు కట్టాల్సి ఉంటుంది.  ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని కేటగిరీల్లో పెంచితే కమర్షియల్, ఓపెన్ ల్యాండ్స్తో పాటు బస్తీలు, కాలనీల రెసిడెన్షియల్స్ యజమానులపై కూడా ఎఫెక్ట్ పడనుంది. ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నవారు 2 లక్షల50 వేల మంది కాగా.. రూ.101 ట్యాక్స్  చెల్లిస్తున్న వారు 3 లక్షల మంది ఉన్నారు.  మిగతా12 లక్షల్లో రెసిడెన్షియల్, ఓపెన్ ల్యాండ్స్ యజమానులు ఉన్నారు.  గత ఆర్థిక ఏడాదిలో రూ.1,704 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను  వసూలు చేసిన బల్దియా ఈ ఆర్థిక సంవత్సరంలో  రూ.1,850 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే నెల ఆఖరు నాటికి ఈ టార్గెట్ని రీచ్ అయ్యేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 40 నుంచి 50 శాతం ట్యాక్స్ పెంచితే  ఏడాదికి రూ.2,500 కోట్ల ఆదాయం రావొచ్చని బల్దియా అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Posts