YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహానటికి కలెక్షన్లు..

మహానటికి కలెక్షన్లు..

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాకు విశేష స్పందన వస్తోంది. సున్నితమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి మనస్సును హత్తుకుంటోన్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘మహానటి’ హవా కొనసాగుతోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు, ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో వన్ మిలియన్ డాలర్లను సంపాందించిన ఈ చిత్రం మిగిలిన దేశాల్లో కూడా సత్తా చాటుతోంది.యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు మంచి మార్కెట్ ఉన్న యూఎస్ బాక్సాఫీసు వద్ద అయితే ‘మహానటి’ సత్తా చాటుతోంది. యూఎస్‌లో మిలియన్ డాలర్లు (సుమారు రూ.6.73 కోట్లు) వసూళ్లను దాటేసింది. ఆదివారం కూడా వసూళ్లు బాగుంటాయని.. 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.10 కోట్లు) దాటిపోవడం ఖాయమని అంటున్నారు.ఆదివారం 3.5 లక్షల డాలర్ల నుంచి 4 లక్షల డాలర్లు వసూలు చేయొచ్చని అంచనా వేశారు. ఇక బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.. ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ వసూళ్లను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శనివారం వరకు తొలి నాలుగు రోజుల్లో ‘మహానటి’ ఆస్ట్రేలియాలో సుమారు రూ.64.03 లక్షలు, యూకేలో రూ.25.90 లక్షలు, న్యూజిలాండ్‌లో రూ.4.65 లక్షలు వసూలు చేసినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు.

Related Posts