న్యూఢిల్లీ
రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్కుమార్, సురేశ్రెడ్డి, లింగయ్య యాదవ్ కలిసి నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో ఫిర్యాదు చేశారు. తలుపులు మూసేసి బిల్లును పాస్ చేశారనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనల కిందికే వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టే ముందు కావాల్సిన విధానాలన్నింటిని పార్టీలు పాటిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.
రాజ్యసభలో తెరాస ఎంపీల నిరసన అనంతరం తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిలబడి తెరాస ఎంపీలు నిరసన తెలిపారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెరాస ఎంపీ కె.కేశవరావు రాజ్యసభలో ప్రస్తావించారు. సభ్యులను వారించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్.. సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసును ఛైర్మన్ పరిశీలనకు పంపామని, సంయమనం పాటించాలని సూచించారు.