వరంగల్
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణపై ప్రధాని అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపడం వల్లనే కరోన పెరిగిందని ప్రధాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తీసుకొచ్చి భారీ సభ పెడితే కరోనా పెరుగలేదా. కేంద్రం చేయలేని పనిని రాష్ట్రాలు చేస్తే ప్రధాని విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి చూపెడుతున్నారు. తెలంగాణ అమరుల ఆత్మ త్యాగాలను ప్రధాని అవమానిస్తున్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని తెలంగాణను మోసం చేసింది బీజేపీ. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లినయి. స్థానిక బీజేపీ నాయకులు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. ప్రధాని వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఎలా సమర్ధిస్తారని మంత్రి ప్రశ్నించారు.