నంద్యాల
నంద్యాల పట్టణంలో గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులకు పెంచిన పదవీ విరమణ వయస్సు తగ్గించాలని డిమాండ్ చేశారు . నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ. పి డి ఎస్ యు. పీ వై ఎల్ వామపక్ష విద్యార్థి ప్రజాసంఘాలు ఆధ్వర్యంలోచలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో విద్యార్థి యువజన సంఘాలు సన్నద్ధమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము వారిని ఎక్కడికి అక్కడే నివారించాలని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతో నంద్యాల పరిధిలోని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం అమానుషమని ఆయన అన్నారు . ఇది దుర్మార్గమైన చర్య అని వెంటనే వారిని విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కే. ప్రసాద్. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి డి. శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి జి. సోమన్న.ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని పోలీసు పాలన నడుస్తోందని హక్కుల కోసం విద్యార్థి. యువజనులు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితేవారినిఅక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని అని అన్నారు.
రాష్ట్రంలోనే ఉద్యోగస్తులు వయోపరిమితి పెంపు ను అడగలేదని నూతన పిఆర్సి ని రద్దు చేయాలని ఉద్యమించార ని వారిలో కొంతమందిని ప్రభుత్వము నయానా భయానా బెదిరించి లొంగదీసుకున్నా రని విమర్శించారు.
రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటే పెరిగిన ధరలను అదుపులో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కృషి చేయకుండా అడగని వాటికి నేను ఇస్తున్నాను అని గొప్పలు చెప్పుకోవడం విచారకరమని అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి ఆకలి కేకలతో నిరుద్యోగుల రోడ్డెక్కితే ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం హక్కులకోసం ఉద్యమాలు నిర్వహిస్తుంటే నిర్బంధాలు చేయడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నించడం అసాధ్యమని ఇప్పటికైనా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థి. యువజన. నిరుద్యోగుల. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతారని హెచ్చరించారు.