YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మల్లి తెరమీదకు విశాఖ రాజధాని అంశం

మల్లి తెరమీదకు విశాఖ రాజధాని అంశం

అమరావతి ఫిబ్రవరి 10
మరోమారు విశాఖ రాజధాని అంశం తెరమీదకు వస్తోంది. విశాఖ శారదాపీఠాన్ని సందర్శించుకోవడానికి వచ్చిన జగన్ పనిలో పనిగా విశాఖ రాజధానికి ముహూర్తం ఖరారు చేయించుకున్నారు అని ప్రచారం జరుగుతోంది.దాని ప్రకారం చూస్తే మార్చి 4న విశాఖ రాజధానిగా ప్రకటించడానికి ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని అంటున్నారు. దానికి ముందు అంటే ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో విశాఖ రాజధాని పేరిట బిల్లుని ప్రవేశపెడతారు అంటున్నారు. విశాఖను ఏకైక రాజధానిగా చేస్తారా లేక గతంలో మాదిరిగా మూడు రాజధానుల బిల్లు ఉంటుందా అన్నది అయితే తెలియదు. కానీ చూడబోతే విశాఖ మీదనే ఫోకస్ పెట్టి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు రూపకల్పన చేస్తారు అంటున్నారు.ఇక విశాఖ రాజధాని ఆలోచనల నుంచి ప్రభుత్వం వెనక్కి పోవడం లేదని ఈ మధ్య తరచూ మంత్రులు చేస్తూ వస్తున్న ప్రకటనలు చెబుతున్నాయి. అదే టైమ్ లో విశాఖ రాజధానిగా చేసినా అమరావతి సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలను రూపకల్పన చెస్తారు అని అంటున్నారు. ఇలా విశాఖ రాజధానిగా చేయాలనుకుంటున్న జగన్ కి మంచి ముహూర్తం స్వామీజీ సూచించినట్లుగా చెబుతున్నారు.మరో వైపు చూస్తే జగన్ మంత్రి వర్గ విస్తరణకు ఈ నెల 18ని ముహూర్తంగా ఎంచుకున్నారు అని అంటున్నారు.   ఈ విషయాలు అన్నీ జగన్ స్వామి భేటీలో ప్రస్థావనకు రావడం జరిగింది అంటున్నారు. మరి టైమ్ చూస్తే తక్కువగా ఉంది. అయినా సరే జగన్ అనుకుంటే చెసేస్తారు కాబట్టి మంత్రి వర్గ విస్తరణకు కూడా ముహూర్తం స్వామి పెట్టి ఉంటారని కూడా అంటున్నారు.మంత్రుల విషయం వస్తే పనితీరు ఆధారంగా సీనియర్లతో పాటు కొందరిని కొనసాగిస్తూనే ఎక్కువ మందికి ఉద్వాసన పలికే వీలుందని అంటున్నారు. మొత్తానికి రానున్న రెండు మూడు వారాలూ చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో అనేక కీలకమైన మార్లుపు సంభవించే  అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఇక బడ్జెట్ సమావేశాలో విశాఖ రాజధానితో పాటు కొత్త జిల్లాల విషయం కూడా ప్రస్థావనకు వస్తుంది అంటున్నారు. విశాఖ రాజధాని అన్నది ముఖ్యమంత్రి  జగన్ మదిలో మెదిలో ఉన్న బలమైన ఆలోచన. ఆయన విశాఖను రాజధానిగా చూడాలని ముఖ్యమంత్రి అయిన తొలి ఆరు నెలలలోనే అనుకున్నారు. దాన్ని నాడే శాసనసభ సమావేశాల్లో  బయటపెట్టారు. ఆ మీదట హడావుడిగా మూడు రాజధానుల బిల్లుని తయారుచేయించారు.  ఇటు అసెంబ్లీలో మండలిలో ఆగమేఘాల మీద  ఆమోదించారు.సరే దాని మీద కోర్టులో విచారణ కోసం పిటిషన్లు దాఖలు అయ్యాయి. తీరా విచారణ జరుతున్న సమయాన ప్రభుత్వం దాన్ని సడెన్ గా  విరమించుకుంది.

Related Posts