YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ ఖాతాలోకి తుక్కుగూడ మున్సిపాలిటీ..ఖంగు తిన్న టీఆర్ఎస్

బీజేపీ ఖాతాలోకి తుక్కుగూడ మున్సిపాలిటీ..ఖంగు తిన్న టీఆర్ఎస్

రంగారెడ్డి
తెలంగాణ రాజకీయాలు అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతోంది. రాష్ట్రంలో బలోపేతం దిశగా సాగుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు.. కేంద్రంలోని ఆ పార్టీ సర్కారుపై కేసీఆర్ పోరాటానికి దిగారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోడీపై ఆరోపణలకు పదునెక్కించారు. మరోవైపు బీజేపీ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. పార్లమెంట్లో ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మంట పుట్టించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీ షాకిచ్చింది. తుక్కుగూట మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది.రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తుక్కుగూడ మున్సిపాలిటీని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా ఉన్న కాంటేకార్ మధుమోహన్ ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సిపాలిటీ బీజేపీకి తక్కుకూడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 5 బీజేపీ 9 స్థానాల్లో గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మధుమోహన్  ఛైర్మన్ పదవి కట్టబెట్టిన టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీని దక్కించుకుంది. కానీ ఇప్పుడు మధుమోహన్ తిరిగి సొంత గూటికే చేరడంతో బీజేపీకి మున్సిపాలిటీ దక్కింది.గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మధుమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ నాయకులతో ఆయనకు పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనలోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు.దీంతో మధుమోహన్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. అనుకున్నట్లుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రామ్చందర్రావు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ ఆధ్వర్యంలో మధుమోహన్ తిరిగి బీజేపీలో చేరారు. మరోవైపు మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల వరకు ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ఇప్పటికే రెండుళ్లు గడవడంతో మరో ఏడాది పాటు ఆయన పదవికి ఢోకా లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Related Posts