YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోదావరిఖని లో అగ్నిప్రమాదం

గోదావరిఖని లో అగ్నిప్రమాదం

పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వ్యాపార కేంద్రం లక్ష్మీ నగర్ లోని పల్లవి లేడీస్ ఎంపోరియం లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్ లో ఉన్న విద్యుత్ తీగల మధ్య షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే షాప్ లో ఉన్న సుమారు 40 లక్షల సామాగ్రి మంటలకు కాలి బూడిద అయినట్లు షాపు యజమాని పేర్కొంటున్నారు. సంఘటన స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి, విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ప్రమాదం జరిగిన విషయంలో పోలీసు సిబ్బంది పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో లక్ష్మీ నగర్ వ్యాపారకేంద్రం ఉలిక్కిపడింది.

Related Posts