YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలంలో ప్రోటోకాల్ చర్చ

కమలంలో ప్రోటోకాల్ చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 11,
ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పగానే బీజేపీ నాయకులు.. కార్యకర్తల్లో చాలా ఫీలింగ్స్‌ కలుగుతాయి. ఇక ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం వస్తే.. బీజేపీ బ్యాచ్‌కు కలిగే ఆ ఆనందమే వేరు. ఇటీవల మోడీ హైదరాబాద్‌ పర్యటనలో అదే జరిగిందట. కాకపోతే ప్రధానికి పార్టీ తరఫున ఎవరెవరు స్వాగతం పలకాలి.. వీడ్కోలు చెప్పేదెవరు అనేదానిపై పెద్ద చర్చే జరిగిందట. ప్రధాని పర్యటన ముగిసేవరకు లాస్ట్‌ మినిట్‌ వరకు పార్టీ ప్రొటోకాల్‌ లిస్ట్‌లో మార్పులు చేర్పులు చేశారట. దానిపైనే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది.ప్రధాని మోడీ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా బీజేపీ ముఖ్య నాయకులే కలిసి మాట్లాడతారు. భారీగా వస్తాం.. స్వాగతాలు చెబుతాం.. ఘనంగా వీడ్కోలు పలుకుతాం అని అంటే ప్రధాని సెక్యూరిటీ అనుమతించదు. అలాంటిది దాదాపుగా 70 మంది వరకు బీజేపీ నేతలు ఈ దఫా టూర్‌లో మోడీని కలిసే అవకాశం లభించిదట. భారీ జాబితా కావడంతో ఎవరు ఎక్కడ ఉండాలన్న దానిపై కొంత కసరత్తు చేసి ప్లేస్‌లు ఫైనల్‌ చేసేశారట. కానీ.. ఆ లిస్ట్‌ చూశాక కొందరు బీజేపీ నాయకులు పెదవి విరిచారట. మేము అక్కడ ఉండాలా? అదేంటి.. పార్టీలో మా ప్రాధాన్యం అంతేనా? సీనియర్లకు సరైన గుర్తింపు లేకపోతే ఎలా? అంటూ చాలా ప్రశ్నలే వచ్చాయట. దాంతో పార్టీలో ప్రొటోకాల్ రగడ పెద్దది కాకుండా వెంటనే సర్దుబాటు చేసినట్టు సమాచారం.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీ ల్యాండైంది మొదలు.. ఇక్రిశాట్‌, ముచ్చింతల్‌ పర్యటనల వరకు రిసీవింగ్‌ జాబితాలో ఎవరు ఉండాలి.. వీడ్కోలు చెప్పేటప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించారట. బీజేపీలో జాతీయస్థాయిలో బాధ్యతలు ఉన్నవారిని శంషాబాద్‌లో ప్రధాని మోడీకి స్వాగతం పలికే జాబితాలో పెట్టలేదట. దానిపై ప్రశ్నలు రావడంతో వెంటనే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్లు తొలుత ప్రధాని మోడీని రిసీవ్‌ చేసుకునే లిస్ట్‌లో లేవట. కానీ.. ప్రధానికి స్వాగతం పలికిన వారిలో వారిద్దరూ ఉన్నారు. అలాడే మోడీకి వీడ్కోలు చెప్పే బీజేపీ నేతల జాబితాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేరు లేదట. కానీ.. ఆయన ప్రధానికి వీడ్కోలు చెబుతున్న బీజేపీ నేతల వరసలో కనిపించారు. ఇలా చాలా మంది పేర్లు అటూ ఇటూ అయినట్టు పార్టీ వర్గాల కథనం.పార్టీ తరఫున ప్రొటోకాల్‌ పాటించే క్రమంలో కొందరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని.. మరికొందరికి బీజేపీలో ప్రొటోకాల్‌ పోస్ట్‌ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్య నేతలను ఒకే దగ్గర కాకుండా వేర్వేరు చోట్ల ఉంచామని సర్ది చెబుతున్నారట కమలనాథులు. కాకపోతే ప్రధానికి స్వాగతం.. వీడ్కోలు చెప్పిన ప్రతిచోటా బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో కనిపించడం ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. మోడీ టూర్‌ మొత్తం బీజేపీ కార్యక్రమంగా మార్చేశారనే విమర్శలు తప్పలేదు.

Related Posts