హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు,హైదరాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తెలిపారు.
జూబ్లీహిల్స్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడేళ్ల లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఎన్నో పథకాలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి లోగోను విడుదల చేశారు. గత సంవత్సరం మాదిరిగానే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ తో సహా పలువురు టీఆరెస్ కార్పొరేటర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.