YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జనగామ సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ
శుక్రవారం ఉదయం జరిగిన జనగామ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కొమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు తదిరుతలు కు కేసీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు, అధికారులు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ ప్రారంభవం తరువాత  కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. గతంలో జనగామని చూసి ప్రొ.జయశంకర్ ఎంతో బాధపడేవారని తెలిపారు. చేలు,చెట్లు ఎండిపోయి దుర్భర పరిస్థితులు ఉండేవని కేసీఆర్ అన్నారు. మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్ళేవారని.. ఆ పరిస్థితులు చూసి ఏడ్చానని తెలిపారు సీఎం. పట్టుబట్టి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తెచ్చుకున్నామన్నారు.
ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడ్డామని అన్నారు.  మంచినీరు, సాగునీరు లభ్యం కావడంతో ఇక్కడ, భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. అభివృద్ధి కోసం జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో అధికారుల పాత్ర ఎంతో ఉందన్న సీఎం.. తెలంగాణకు కరువు అనేది రాదన్నారు. కరెంటు 24 గంటలు ఉంటుందన్నారు.  రీజినల్ రింగ్ రోడ్డుతో రాబోయే రోజుల్లో భూములు బంగారమైతయని సీఎం కేసీఆర్ అన్నారు.

Related Posts