విజయవాడ, ఫిబ్రవరి 12,
విజయవాడ నగరాలకు ఆనుకున్ని ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక వాడలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం విధివిధానాలు రూపొందిం చింది. పారిశ్రామిక యూనిట్లను జనావాసాలకు దూరంగా తరలించడంతో పాటు ప్రస్తుతమున్న స్థలంలో సగం మార్కెట్ విలువను లేదా సగం స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు రెండు జిఓలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల పట్ల పారిశ్రామిక వేత్తలలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవు తోంది. జిఓలు విడుదల, భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణా మాలు తదితర అంశాలపై చర్చించేందుకు విజయవాడలో పారిశ్రామికవేత్తలందరూ సమావేశమయ్యారు. సుమారు రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. జిఓల ప్రకారం విజయవాడ ఆటోనగర్ మీదే ప్రభుత్వానికి రూ.3,285 కోట్లు ఆదాయం వస్తుందని లెక్కగట్టారు. జిఓలు అమలు చేయడం వల్ల ఇప్పుడు అటూఇటుగా నడుస్తున్న పరిశ్రమలతోపాటు, లక్షలాది మందికి ఉపాధి నిస్తున్న కంపెనీలన్నీ మూత వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకటీ రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక వాడలు విశాఖపట్నం చుట్టుపక్కల, విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఊరికి దూరంగా ఏర్పాటు చేసినప్పటికీ రానురాను నగరంలో కలిసిపోయాయి. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ జనావాసాలకు దూరంగా తలరించి పారిశ్రామిక కేటగిరీలో ఉన్న భూములను వాణిజ్య, నివాస కేటగిరీలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఉత్తర్వుల ప్రకారం విజయవాడ జవహర్ ఆటోనగర్‌ను పూర్తిగా మూసేయాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థానిక పారిశ్రామిక వేత్తకలు సమాచారం కూడా అందింది. ప్రస్తుతం జవహర్ ఆటోనగర్లో 1600 అసెస్మెంట్లు ఉన్నాయి. సుమారు 345 ఎకరాల్లో ఉంది. మొత్తంలో ప్రతిరోజూ నేరుగా 50 నుండి 60వేలమంది దీనిపై ఆధారపడి బతుకున్నారు. దీన్ని మూసేయడం వల్ల వారి ఉపాధి కష్టమవుతుంది. ఇక్కడ గజం రూ.60 వేలవరకూ ఉంది. ఇచ్చిన జిఓలోనూ మార్కెట్ విలువలో 50 శాతం కట్టాలని పేర్కొన్నారు. దీని ప్రకారం విజయవాడ ఆటోనగర్‌లో భూమి విలువ రూ.6210 కోట్ల వరకూ పలుకుతోంది. దీనిలో సగం అంటే రూ.3105 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అంచనా, ఆటోనగర్ భూములు పారిశ్రామిక వినియోగం నుండి వాణిజ్య, నివాస యోగ్యంగా మార్చే ప్రక్రియను రెవెన్యూ, పట్టణాభివృద్ధి సంస్థలు చేయాల్సి ఉంది. వాటితో ఆపనిచేయించేందుకు భూమి విలువలో 50 శాతం ఎపిఐఐసికి చెల్లించాలి. రెవెన్యూ, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన పన్నులు యథావిథిగా చెల్లించాలి. అసలే ఆటోనగర్లో ఎత్తేయడం వల్ల ఉపాధి పోతుందని, మరోచోట పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే అదనపు భారం పడుతుందని ఆందోళన పడుతుంటే ఈ అదనపు ఫీజులు తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తాయని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూతపడిన పరిశ్రమలు మార్కెట్ విలువలో 50 శాతం చెల్లించి కన్వర్షన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సమాచారశాఖ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరాల్లో ఎపిఐఐసి పరిధిలోని పరిశ్రమలన్నీ 50 చెల్లించి వాణిజ్య కార్యకలాపాలు చేసుకోవచ్చని తెలిపారు. గవర్నమెంటు పరిధిలో పరిశ్రమలు 15 శాతం మార్కెట్ వ్యాల్యూ చెల్లించి భూమిస్థితి మార్చుకోవచ్చని వివరించారు. ఈ మేరకు విశాఖపట్నం స్మాల్ స్కేల్ ఇండిస్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్, పారిశ్రామికవేత్త సిహెచ్.రవికుమార్, విశాఖ ఆటోనగర్ ఛైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి అభిప్రాయాలను విడుదల చేశారు.