YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాక రేపుతున్న రాజకీయం

కాక రేపుతున్న రాజకీయం

హైదరాబాద్, ఫిబ్రవరి 12,
జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఆ పేరులో 'రెడ్డి'ని ట్రెస్ చేస్తుంటారు ఆయ‌న అభిమానులు. ఇక‌, జ‌గ‌న‌న్నేమో.. 'క‌మ్మ' పేరుతో కుల గ‌బ్బు రేపుతుంటారు. కొవాగ్జిన్‌నూ కులం గాడిన క‌ట్టిన ముఖ్య‌మంత్రి ఆయ‌న‌. ఇక, నిమ్మ‌గ‌డ్డ నుంచి రామోజీరావు వ‌ర‌కూ.. అంద‌రినీ చంద్ర‌బాబు కులానికి లింకుపెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతుంటారు. ఇక‌, ఆయ‌న చేసిన, చేస్తున్న‌ కాపు రాజ‌కీయం ఇప్ప‌టికీ కాక రేపుతూనే ఉంది. అందుకే, ఈసారి సీఎం జ‌గ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా పావులు క‌దిపారు. సినిమా ప్ర‌ముఖుల‌తో మీటింగ్‌లో క్యాస్ట్ ఈక్వేష‌న్‌ను చాలా ప‌ద్ద‌తిగా పొందుప‌రిచారు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన సినీ స్టార్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే ఆ కులాల లెక్కేంటో తేలిపోతుంది. చిరంజీవి, మ‌హేశ్‌, ప్ర‌భాస్‌.. ముగ్గురూ మూడు కులాల‌కు ప్రాతినిధ్యం వ‌హించే టాప్ హీరోలు. క‌మ్మ కులానికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ మొద‌ట్నుంచీ గ‌ళం విప్పుతున్నార‌న్న ప్ర‌చారం ఉంది. అందుకే అలాంటి ప్ర‌చారానికి తావు లేకుండా వివిధ కులాల‌కు ప్రాతినిధ్యం ఉండేలా త‌నతో భేటీ అయ్యే బృందాన్ని జాగ్ర‌త్త‌గా సెలెక్ట్ చేశారు జ‌గ‌న్‌. కాపు వ‌ర్గం నుంచి చిరంజీవిని ముందుంచి.. కాపుల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్ర‌మే కాదు తానూ కావాల్సిన‌వాడిన‌నే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. క‌మ్మ క‌మ్యూనిటీ నుంచి మ‌హేశ్‌బాబు, పోసాని, రాజ‌మౌళి, కొర‌టాల‌ల‌ను ర‌ప్పించుకుని.. కాస్త డ్యామేజ్ కంట్రోల్‌కు ప్ర‌య‌త్నించారు. ఇక‌, ర‌ఘురామ ఎపిసోడ్‌తో ఆ వ‌ర్గం వైసీపీకి దూరమ‌వ‌గా.. ప్ర‌భాస్‌ను ఇన్వైట్ చేసి 'రాజు'ల‌ను సంతృప్తి ప‌రిచే వ్యూహం ప‌న్నారని అంటున్నారు. ఇక ఎంత‌మంది ఉన్నా.. రెడ్డి గారు లేక‌పోతే ఎలా? అందుకే, ఈసారి దిల్‌రాజురెడ్డిని కాకుండా.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజ‌న్‌రెడ్డిని ఆహ్వానించారు. కులాల స‌మ‌తూకంతో పాటు.. మ‌త సామ‌ర‌స్యం కూడా పాటించిన‌ట్టున్నారు జ‌గ‌న‌న్న‌. అందుకే కాబోలు.. అస‌లు ప్ర‌స్తుత ఇష్యూతో అస‌లేమాత్రం సంబంధంలేని అలీని కూడా జ‌ట్టులో చేర్చుకుని.. చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇలా, కులమ‌తాల స‌మ‌తూకంతో తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్నాట‌కాన్ని బాగానే ర‌క్తి క‌ట్టించారని అంటున్నారు. జ‌గ‌న‌న్నా.. మ‌జాకా...!!
మంచు ఫ్యామిలీకి మైనస్సేనా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును ఆయన సమీప బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైడ్ చేసేశారా? సీఎం జగన్‌కి, మంచు విష్ణుకి ఉన్న సంబంధం బావా బావమరది సంబంధం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచు విష్ణుకు సీఎం జగన్ మధ్య వ్యవహారం చెడిందా? ఆ క్రమంలోనే ముంచు విష్ణును కూరలో కరివేపాకు తీసినట్లు తీసి సీఎం జగన్ పక్కన పెట్టేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని సినిమా రంగంపై నీలి నీడలు కమ్ముకోవడంతో.. వెండి తెర వెలవెల బోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలు విడుదలకావడం లేదు. ఓ వేళ ఒకటి అర సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. కానీ భారీ బడ్జెట్‌లో నిర్మించిన పెద్ద సినిమాలు మాత్రం వాయిదా పద్దతిని అనుసరిస్తు.. విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో చిత్ర పరిశ్రమలో ఓ విధమైన ప్రతిష్టంభన నెలకొంది. ఆ క్రమంలో మా అధ్యక్షుడి మంచు విష్ణు అధ్యక్షుడి హోదాలో తన బావ సీఎం జగన్‌తో మాట్లాడి.. తెర మీద బొమ్మ పడేందుకు.. తన శక్తి వంచన లేకుండా కృషి చేయడమే కాకుండా.. అవసరమైతే తెర వెనక చాలా కూల్‌గా వ్యవహరం చక్క బెడతారంటూ ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో టాక్ జోరుగా వైరల్ అయిందని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ రోజులు గడుస్తున్న.. ఈ వ్యవహారంపై మంచు విష్ణు కానీ, ఆయన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ సరైన సమయంలో సరైన విధంగా స్పందించ లేదు. ఈ నేపథ్యంలో ఈ తండ్రి కొడుకులపై  టాలీవుడ్‌లోని అగ్రహీరోల నుంచి లైట్ బాయి వరకు అందరు నిప్పులు చెరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఎన్నడు జరగని విధంగా గతేడాది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే... మా అధ్యక్షుడిగా మా బెల్డింగ్ నిర్మిండచమే కాదు... టాలీవుడ్‌లోని అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ కూడా మంచు విష్ణు ఇచ్చారని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత.. థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు సైలెంట్ అంటూ స్లైడ్‌లో వచ్చే బొమ్మలాగా మంచు విష్ణు సైలెంట్ అయిపోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు ఫిలింనగర్‌లో జోరందుకున్నాయని సమాచారం.    సమస్య వచ్చినప్పుడు.. సమర్థవంతంగా వ్యవహరించి.. అటు ప్రభుత్వానికి ఇటు చిత్ర పరిశ్రమకి మధ్య వారధిగా ఉంటూ.. పరిస్థితులు చక్కదిద్దే గుణం ఈ మా అధ్యక్షుడు మంచు విష్ణులో ఇంచుకైనా లేదని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడు అయినా.. నాయకుడు అయినా.. వ్యవహారదక్షతతో వ్యవహరించి.. సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు. కానీ మంచు విష్ణులో అవి లేవని.. మా అధ్యక్ష పదవి.. ఆయనకు ఓ అలంకారం మాత్రమేనని ఫిలింనగర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అదీకాక మంచు విష్ణు, సీఎం జగన్‌ల మధ్య రిలేషన్స్ దాదాపుగా కట్ అయిపోయాయనే టాక్ అయితే ఫిలింనగర్ వర్గాలు జోరుగా ఉంది. ఆ క్రమంలోనే సీఎం జగన్‌తో ఇటీవల మెగా స్టార్ చిరంజీవి భేటీ అయ్యారని.. వీరిద్దరి భేటీతో సినిమా పరిశ్రమకు సంబంధం లేదంటూ మీడియా సాక్షిగా మా అధ్యక్షుడుగా మంచు విష్ణు క్లియర్ కట్‌గా చెప్పడంతో ఈ విషయం స్పష్టమవుతోందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజగా ఫిబ్రవరి 10వ తేదీన సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీ, కొరటాల శివ తదితరులు భేటీ అయి.. సినిమా పరిశ్రమలో నెలకొన సమస్యలపై కూలంకుషంగా చర్చించారని తెలుస్తోంది. ఈ సమస్యలకు ఫిబ్రవరి నెలాఖరులోగా శుభం కార్డు పడుతోందంటూ వారు పేర్కొన్న విషయం కూడా విధితమే. కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ.. మంచు ఫ్యామిలీ కానీ ఎక్కడ కనిపించకపోవడంపై టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెర తీసినట్లు అయింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్మాతగా.. ఆయన తండ్రి మంచు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను... సరిగ్గా టాలీవుడ్ హీరోలు.. సీఎం జగన్‌తో అయిన రోజే విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌లో ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ అంటు మంచు మోహన్ బాబు చెప్పే డైలాగ్స్‌కు వీక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోందని... కానీ టాలీవుడ్‌లో ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే.. ప్రపంచం బాధే నా బాధ అన్నప్పుడు.. టాలీవుడ్ బాధ.. మీది కాదా ? అనే ప్రశ్నలు.. మంచు ఫ్యామిలీని నెట్‌జన్లు సోషల్ మీడియా సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికన్న మంచు ఫ్యామిలీ సమాధానం చెబుతుందో లేదో అని నెట్ జన్లు... కామెంట్స పెడుతున్నారు.

Related Posts