పెద్దపులు మాటేశాయి..
పెద్దపులులను దూరంగా ఉండి చూస్తే హడలిపోతారు. అలాంటిది అడుగుదూరంలో రెండు పెద్ద పులులు ఎదురుపడితే.. అంతే సంగతులు.. పైప్రాణాలు పైనే పోవాల్సిందే. సాధారణంగా అటవీ సమీప ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో వాహనదారులకు కృరజంతువులు తారసపడుతుంటాయి. దాంతో అటుగా వెళ్లాల్సిన వాహనాదారులంతా ఎక్కడా తమపై దాడిచేస్తాయనే భయంతో వణికిపోతుంటారు. ఇటీవల మహారాష్ట్రంలోని ఓ ప్రాంతంలో బైక్‌పై వెళ్లే ఇద్దరు వ్యక్తులకు ఇదే అనుభవం ఎదురైంది. కానీ, అదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రాణాలతో భయటపడటం అద్భుతమనే చెప్పాలి.
బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరిని అడుగుదూరంలో రెండు పెద్దపులులు మార్గం మధ్యలో చుట్టుముట్టాయి. వెంటనే బైక్‌ను ఆపేసిన వారు.. ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని ఉండిపోయారు. ఎక్కడ కదిలితే దాడిచేసి చంపేస్తాయోనని బైక్ నడిపే వ్యక్తి అలానే కూర్చొని ఉండగా, వెనుక కూర్చొన్న వ్యక్తి బైక్ దిగి ఎటు వెళ్లలేక బొమ్మలా నిలబడిపోయాడు. ఇదంతా కారులో ఉండి గమనిస్తున్నా కొందరు తమ కెమెరాల్లో బంధించి వీడియోను తీశారు. ఎంతసేపటికి ఆ రెండు పులులు అక్కడినుంచి కదలకపోవడంతో కారును వారికి దగ్గరగా తీసుకెళ్లడంతో అదే సమయంలో బైక్ వేగం పెంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా.. బహుశా.. ఆ పెద్దపులులుకు వారిద్దరి రక్తం రుచి ఇచ్చే మూడ్ లేనట్టుందేమో.. బ్రతికిపోయారు.. పారిపోండి భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరు కూడా భయపడకుండా చూడండి.