హైదారాబాద్, ఫిబ్రవరి 12,
టాలీవుడ్ పెద్ద ఎవరు? చిరంజీవినే అంటున్నారు చాలామంది. కాదు కాదు మోహన్‌బాబు అని చెబుతున్నారు కొంతమంది. 'మా' ఎలక్షన్ల సమయం నుంచీ ఈ చర్చ నడుస్తోంది. లేటెస్ట్‌గా.. అది మరింత జోరందుకుంది. ఇప్పటికే చిరంజీవితో, నాగార్జునతో సీఎం జగన్ వన్ టు వన్ మీట్ అవడం.. తాజాగా, చిరు, ప్రభాస్, మహేశ్, రాజమౌళి, అలీ, పోసానిలతో టాలీవుడ్ సమస్యలపై చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఆ భేటీలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ లేకపోవడం అనేక గుసగుసలకు కారణమవుతోంది. ఇక, ఆ మీటింగ్ హాజరైన మిగతా సినీ ప్రముఖులంతా చిరంజీవిని పొగడడం.. ఇండస్ట్రీ పెద్ద..అంటూ కీర్తించడం.. మెగాస్టార్ ఇమేజ్‌ను మరింత పెంచింది.ఇక, సినిమాలోనే కాదూ.. సినీ పరిశ్రమకూ తానే పెదరాయుడినని చెప్పుకునే మోహన్‌బాబుకు కనీసం మెసేజ్ కూడా ఇవ్వలేదు జగనన్న. ఇక, మా అధ్యక్షుడు మంచు విష్ణును అసలు పట్టించుకోనేలేదు. ఆ పదవిలో ఉన్నా.. డోంట్‌కేర్ అన్నారు. చిరంజీవినే చర్చలకు పిలిచారు.. ముందుంచారు. మంచు ఫ్యామిలీతో రిలేషన్ ఉన్నా.. లైట్ తీసుకున్నారు. బహుషా అందుకే కాబోలు.. మంచు విష్ణు చిరు-జగన్‌ల భేటీ వారి పర్సనల్, ఇండస్ట్రీకి సంబంధంలేదంటూ తన అక్కసు బయటపెట్టారు. కట్ చేస్తే.. తనవారైన మోహన్‌బాబు, మంచు విష్ణులకు జరుగుతున్న డ్యామేజ్‌ను గుర్తించినట్టున్నారు జగన్‌రెడ్డి. వెంటనే మంత్రి పేర్ని నానిని 'మంచు' ఇంటికి పంపించారు. మోహన్‌బాబును కలిసి చిరు అండ్ టీమ్‌తో జగన్ జరిపిన సమావేశం వివరాలను పేర్ని నాని వివరించడం ఆసక్తికరంగా మారింది. ఎవరిది అప్పర్ హ్యండ్ అనే చర్చ మళ్లీ మొదలైంది. పేర్ని నాని ఏమీ మోహన్‌బాబును కలిసేందుకే అమరావతి నుంచి హైదరాబాద్‌కు రాలేదు. సిటీలో జరుగుతున్న మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరై.. ఆ తర్వాత జగన్ ఆదేశాలతో పనిలో పనిగా మోహన్‌బాబును కలిసి మీటింగ్ మేటర్‌ను బ్రీఫింగ్ ఇచ్చారు. ఆయనతో శాలువా కప్పించుకొని.. ఫోటోలు రిలీజ్ చేశారు. చిరంజీవిని జగన్‌రెడ్డి తన ప్యాలెస్‌కు రప్పించుకుంటే.. జగన్ ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రి పేర్ని నాని మోహన్‌బాబు ఇంటికే తరలివచ్చారు. అంటే, ఈ విషయంలో చిరుకంటే మోహన్‌బాబుదే కాస్త అప్పర్‌హ్యాండ్ అంటున్నారు మంచు ఫ్యాన్స్. అయితే, మెగాస్టార్ నేరుగా జగన్‌రెడ్డితో డీల్ చేస్తే.. మోహన్‌బాబు స్థాయి పేర్ని నాని వరకే పరిమితం అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి జగన్‌రెడ్డిని చల్లనిచూపు చూడండంటూ వేడుకోవడం.. చేతులు జోడించి అడగడాన్ని చూపిస్తూ.. మెగాస్టార్ దిగజారుడుతనాన్ని ఎద్దేవా చేస్తున్నారు మంచు మనుషులు. కనీసం చిరునైనా పిలిచారు.. మోహన్‌బాబును, విష్ణును ఆమాత్రం కూడా పట్టించుకోలేదంటూ అటునుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇలా, సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య కామెంట్ల వార్ నడుస్తోంది. రచ్చ రంబోలా అవుతోంది. ఇంతకీ టాలీవుడ్ పెదరాయుడు ఎవరు? చిరంజీవా? మోహన్‌బాబా?