ముంబై, ఫిబ్రవరి 12,
భారత ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి చోదకంగా నిలిచేందుకు కేంద్రం తెచ్చిన గతిశక్తి ప్రణాళిక వల్ల సిమెంట్ సెక్టార్ ఎక్కువగా ప్రయోజనం పొందనున్నట్లు తేజ్ మండీ స్టాక్ ఎడ్వైజరీ సంస్థ ప్రతినిధి ప్రముఖ బిజినెస్ న్యూస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో తెలిపారు. జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కోసం.. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు కింద రూ. 100 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయి. రోడ్లు, రైల్వేలు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ప్రజా రవాణా వ్యవస్థలు, జల రవాణా వ్యవస్థలు, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు గతిశక్తి కింద ఉన్నందున్న సిమెంటు రంగంలోని కంపెనీలు ఎక్కువగా లాభపడతాయని ఆయన అంచనా వేశారు.తాజాగా కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి ప్రోత్సాహకంగా ఉంటుందని తాను భావిస్తున్నానని.. దీని వల్ల ఎకనామిక్ గ్రోత్ తో పాటు కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని అన్నారు. దాదాపు అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి దీనిని రూపుదిద్దారని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలు అభివృద్ధిచెందే విధంగా నిర్ణయాలు జరిగాయని.. తద్వారా రానున్న కాలంలో బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. దీనికోసం మార్కెట్లు సైతం పాజిటివ్ గా పయనించాలని అన్నారు. యూఎస్ ఫెడ్ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగినప్పటికీ బడ్జెట్ వల్ల ఎకనామిక గ్రోత్ ఉంటుందని పేర్కొన్నారు.రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను ఆదాయం, జీడీపీ పెరుగుదలను కేంద్రం కొంత తక్కువగా అంచనా వేసిందని అన్నారు. దానివల్ల ద్రవ్యలోటు ఎక్కువగా ఉండవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా ఆ అంకెలు తక్కువగానే ఉండవచ్చని అన్నారు. మెరుగైన ఆర్థిక పరిస్థితి నెలకొంటుందన్నారు.గడచిన మూడు నెలలుగా విదేశీ సంస్థాగత మదుపరులు భారత్ నుంచి తమ పెట్టబడులను ఉపసంహరించుకుంటున్నప్పటికీ.. రానున్న కాలంలో వారు తిరిగి దేశంలో పెట్టుబడులు పెడతారని అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వల్లనే ప్రస్తుతం FIIలు తమ ఇన్వెస్ట్ మెంట్లను తరలిస్తున్నారు. బడ్టెట్ లో తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని.. అది విదేశీ మదుపరులను మళ్లీ ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు. రానున్న 3-5 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో భారత్ వేంగంగా ఎందుగుతున్న ఆర్థిక శక్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు