YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలం భారీ స్కెచ్...

కమలం భారీ స్కెచ్...

హైదరాబాద్, ఫిబ్రవరి 12,
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకులు, కార్యకర్తలను దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశాలపై కాషాయ దళం ఫోకస్చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా రాష్ట్రస్థాయి నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ బండి సంజయ్ ప్రధానంగా స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు గ్రామ, మండల స్థాయిలో ప్రజల్లో పేరున్న నేతలను చేర్చుకునే అంశంపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో టీఆర్ఎస్ దెబ్బకొట్టి బీజేపీని విస్తరింపజేయడే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.బీజేపీలో చేరికలకు ఇప్పటికే జాయినింగ్స్కమిటీని బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అందులో భాగంగా అధికార పార్టీతో సహా కాంగ్రెస్ కు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకునే అంశంపై జిల్లా అధ్యక్షుడు, జాయిన్సింగ్స్ కమిటీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుసూదన్ తాజాగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమదేవి ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీని ఈనెల 16న బీజేపీలో విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీలో వలసల ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. దీనికిగాను బండి సంజయ్ ఈనెల 12న ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలోని జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై పార్టీలో చేరికల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.జాయినింగ్స్ అండ్ కో ఆర్డి నేషన్ కమిటీ చైర్మన్ గా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్ ఏ చంద్రశేఖర్, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బండారి రాధికను జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా నియమించారు. క్షేత్రస్థాయిలో చేరికలపైనే ఈ టీం ప్రధానంగా ఫోకస్పెడుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి చేరవేస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్నామారూపాల్లేకుండా చేయడమే ప్రధానంగా ఈ టీం పనిచేస్తోంది.గ్రామస్థాయిలో ప్రజల్లో పేరున్న, పట్టున్న నాయకుడిని ఎంచుకొని చేరికలపై దృష్టిసారిస్తోంది. అంతేకాకుండా పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న వారిని మాత్రమే గుర్తించి బీజేపీలోకి చేర్చుకునే పనిలో పడింది. దీంతోపాటు స్థానికంగా మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత-కొత్త నేతల కలయికతో పార్టీని సమన్వయం చేయడమే లక్ష్యంగా జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ కసరత్తు చేస్తోంది

Related Posts