YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడేళ్ల నుంచి సాగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులు

మూడేళ్ల నుంచి సాగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులు

మెదక్‌ ప్రజలు సేదదీరేందుకు పట్టణంలో ఒక్క పార్కు కూడా లేదు.   2016లో ప్రారంభమైన పనులు ఇంకా ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి 2016లో మినీ ట్యాంక్‌ బండ్‌ పనులకు శంకుస్థాపనచేశారు. పనుల్లో భాగంగా రెండు చెరువు కట్టలను 40 అడుగులకు విస్తరించారు. ఇప్పటి వరకు కట్టపై మట్టిపోసి బలోపేతం చేశారు.మూడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. త్వరగా పనులు పూర్తి చేసి అందరికీ ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గోసముద్రం చెరువుకు సంబంధించి మూడు తూములను, పిట్లం చెరువు నుంచి ఒక తూమును తొలగించి అధునాతన పద్ధతిలో పిట్లం చెరువు వద్ద రిట్నరింగ్‌ గోడను నిర్మించారు. దీంతో ప్రజలు ఆహ్లాదానికి, అనుభూతికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలోని గోసముద్రంను మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తున్నారని తెలిసి ప్రజలు సంతోషించారు. ఈ పనులు చేపట్టేందుకు రెండు నెలలు పట్టింది. చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి పనులు జరుగుతుండగా పూడికతీత పనులు ఇప్పటివరకు చేపట్టలేదు. చెరువు కట్టపై పార్క్‌ ఏర్పాటు, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే రూ 4.48 కోట్ల నిధులు మంజూరు చేయించగా మరో రూ. 2 కోట్లు మంజూరు చేయించి మిగతా పనులు చేయిస్తామని పలుమార్లు తెలిపారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు పూర్తిచేశామని, అదనపు  నిధులు మంజూరు కాగానే బ్యూటిఫికేషన్‌ ఇతర పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.ఏవో కారణాలతో కొంతకాలం కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశాడు. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు కట్టకు ఇరువైపులా రెండు అలుగులు నిర్మించారు. పెద్దతూం, మిర్రతూంలను కొత్తగా నిర్మించారు. అలుగుపై  కట్టపై రెండు వైపుల సీసీతో దిమ్మెను వేశారు. దీంతోపాటు కట్టపైకి వాహనాలు వెళ్లేందుకు సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. రెండు కల్వర్టులు, రెండు బతుకమ్మ ఘాట్లతోపాటు కట్టపైకి ఎక్కేందుకు మెట్లు నిర్మించారు. అలుగుపై నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జ్‌ నిర్మించి రెండు వైపులా పైప్‌లు అమర్చారు. కానీ ఇంకా బ్రిడ్జ్‌ వద్ద మట్టిని పూర్తిస్థాయిలో పోయలేదు. చెరువు కట్ట లోపలి వైపు నీటితాకిడికి మట్టికొట్టుకుపోకుండా ఉండేందుకు రాళ్ల తెట్టెను పేర్చి పైనుండి సిమెంట్‌ వేశారు. ట్యాంక్‌బండ్‌ నిర్మాణం పనుల్లో నాణ్యతను పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు అంచనా కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.పట్టణంలోని మురికి నీరు పిట్లం చెరువులో కలుస్తుంది. మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న  మురుగునీరు చెరువులో కలవకుండా భూగర్భ మురికి కాల్వలను నిర్మించారు. ఇందుకోసం పైప్‌లైన్లను తెప్పించారు. ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రెండు చెరువు కట్టలకు విస్తరణ కోసం వేసిన మట్టి పలుచోట్ల అప్పుడే బీటలు వారింది. చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇంకా మెట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఆహ్లాదం కోసం పచ్చిక బయళ్లు, వీధి దీపాలు, బోటింగ్, ఫుట్‌పాత్, పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది.కౌడిపల్లిలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల నిధులు వెచ్చించారు. ఇరిగేషన్‌ అధికారుల సమాచారం ప్రకారం నిధులు విడుదలైన మేరకు పనులు పూర్తయ్యాయి. అయితే వాస్తవంగా ఇంకా మినీ ట్యాంక్‌ బండ్‌ బ్యూటిఫికేషన్, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. అధికారులు పనులు పూర్తయ్యాయని చెబుతున్నా పెద్దచెరువు కట్టకు ఇంకా మినీ ట్యాంక్‌ బండ్‌ల పూర్తి స్వరూపం రాలేదు.తూప్రాన్‌ పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు 2016 ఆగస్టులో ప్రభుత్వం రూ.5.70కోట్ల నిధులు కేటాయించింది. అదే ఏడాది డిసెంబర్‌లో పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చెరువు కట్ట మరమ్మతులు జరుగుతున్నా కట్టపైకి వెళ్లాల్సిన చోట చెరువు మత్తడి ఉండడంతో వర్షకాలంలో పైకి వెళ్లలేని పరిస్థితి.  దీనికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు మత్తడి పైన వంతెన నిర్మాణం కోసం రూ. 4కోట్లు, చెరువు కట్ట సుందరీకరణ కోసం టూరిజం శాఖ నుంచి అదనంగా మరో రూ.2కోట్ల నిధులను కేటాయించారు. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు

Related Posts