రాజోలు
తూర్పు గోదావరి జిల్లా.. రాజోలు అంతర్వేది ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో అపశృతి దొర్లింది. లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ క్రతువులో తలంబ్రాలకు అంత్యంత ప్రాముఖ్యం వుంటుంది. స్వామివారి తలంబ్రాలు తలపై వేసుకుంటే పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల అపారనమ్మకం. స్వామి వారి కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలను దక్కించుకోవడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో తోపులాట జరిగింది. అంత్యంత కట్టుదిట్టమైన భద్రత వున్నా కూడా తలంబ్రాల బుట్టను భక్తులు లాగేందుకు ప్రయత్నించగా పెనుగులాటలో అక్షింతలు నేలపాలయ్యాయి. కింద పడిన తలంబ్రాల కోసం ఎగబడిన భక్తులను పోలీసులు అతి కష్టంతో నియంత్రించారు.