విశాఖపట్నం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణంకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షలు శనివారం తో ఏడాది పూర్తి చేసుకుంది.ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని సంవత్సర కాలం పాటు నిరంతరం ఉద్యమ గళాన్ని వినిపిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలతో కేంధ్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు.ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత ఏడాది ఫిబ్రవరి 12న స్టీల్ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఏడాదైన సందర్భంగా శిబిరం వద్ద 365 మంది ఉద్యోగులు 365 ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జెండాలతో దీక్ష చేపట్టారు.అదేవిధంగా రేపు జైల్భరో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి.స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తామని అఖిలపక్షపోరాట కమిటి సభ్యులు చెబుతున్నారు.