YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పెయిడ్ సర్వీసులు ఇకనుండి ప్రతి యూజర్ కు ఉచితం: గూగుల్

పెయిడ్ సర్వీసులు ఇకనుండి  ప్రతి యూజర్ కు ఉచితం: గూగుల్

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
ఇంటర్నెట్ అనే దాంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ ను కాదని పని చేసుకునే అవకాశం ఉండదు. గూగుల్ ఎంత తోపు అన్నది ఈ ఒక్క మాటతో చెప్పేయొచ్చు. జనజీవనంలో అంతటి ప్రభావాన్ని చూపే గూగులమ్మ.. తాజాగా తనకు సంబంధించి ఒక అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.జీ సూట్ వినియోగదారుల కోసం రూపొందించిన కరెంట్స్ ను నిలిపివేస్తున్నట్లుగా తేల్చింది. 2019లో తొలిసారి ఈ సేవల్ని ప్రారంభించిన గూగుల్ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఆ సేవల్ని బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.గూగుల్ అందించే సేవల్లో అతి తక్కువ ప్రజాదరణ పొందిన ఈ కరెంట్స్ కు సంబంధించిన సేవల్ని తామిక అందించలేమని స్పష్టం చేసింది. 2023 నాటికి పూర్తిగా మూసివేస్తామని తాజాగా గూగుల్ తేల్చి చెప్పింది. అయితే.. గూగుల్ కరెంట్స్ ను వినియోగిస్తున్న వారి సంగతేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తోంది. కరెంట్స్ లో ఉండే అన్ని ఫీచర్లను గూగుల్ స్పేసెస్ కు జోడిస్తామని పేర్కొంది. గూగుల్ స్పెసెస్ ద్వారా యూజర్లు చాటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. దీంతో.. సమాచారాన్ని షేర్ చేసుకోవటం చాలా సులువుగా ఉంటుందని చెబుతున్నారు.గూగుల్ స్పెసెస్ వినియోగించే వారు.. జీ మొయిల్ ఇన్ బాక్స్ ద్వారా గూగుల్ ఛాట్ చేసుకోవటంతో పాటు.. గూగుల్ డాకస్ లో చెక్ లిస్టే ఏర్పాటు చేసుకోవటానికి ఇందులోని స్మార్ట్ కాన్వాస్ సాయం చేస్తుంది. పెద్ద కమ్యూనిటీలు పెద్ద ఎత్తున వినియోగించుకోవటానికి గూగుల్ స్పెసెస్ వీలు కల్పిస్తుంది.ఇందులోని స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సాయంతో యూజర్లు తమకు సంబంధించిన డాక్యుమెంట్లను గూగుల్ మీట్ ద్వారా ఇతరులకు షేర్ చేసుకునే వీలుంది. గతంలో పెయిడ్ సర్వీసుగా ఉండేదాన్ని ఇప్పుడు ప్రతి యూజర్ కు ఉచితంగా అందజేయనున్నారు.

Related Posts