విశాఖపట్నం
గంజాయి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎస్ఈబీ కలిసి గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నాయని తెలిపారు. ఒడిశాలో 23 జిల్లాలు, విశాఖలో 11 మండలాల్లో గంజాయి సాగవుతోందన్నారు. ఏడాది నుంచి 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. గంజాయి ని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టాం. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు...అన్ని విధానాలు అయిన మార్గాలు ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారు..దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేసారు. గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేసాము. అపషన్ పరివర్తన్ లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేసాము. ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధీధినం చేసుకున్నాము. 314 వాహనాలు సీజ్ చేసాము. ఇతర రాష్ట్రాల కు చెందిన 154 మంది స్మగ్లర్లు తో పాటు కొత్తగా 300 పై కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచాము. నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేసామని అన్నారు.
నాలుగు జిల్లాల పరిధిలో పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి తగలు పెడుతున్నాము. ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుంది...ఏజెన్సీలో మార్పు మొదలైందని వెల్లడించారు.