YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

‘టెర్రరిస్టు మాదిరిగా వ్యవహరించిన పోలీసులు’ అశోక్‌బాబు అర్ధరాత్రి అరెస్టును ఖండించిన చంద్రబాబు

‘టెర్రరిస్టు మాదిరిగా వ్యవహరించిన పోలీసులు’   అశోక్‌బాబు అర్ధరాత్రి అరెస్టును ఖండించిన చంద్రబాబు

అమరావతి ఫిబ్రవరి 12
టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడలోని పటమటలోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను. సీఐడీ అధికారులువ వ్యవహరించిన తీరును అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘టెర్రరిస్టు మాదిరిగా పోలీసులు విచక్షణరహితంగా అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు. తప్పుడు ఆరోపణలపై అశోక్‌బాబుపై చర్యలు తీసుకున్నారు. అశోక్‌బాబును తన కేసు కంటే ఉద్యోగుల ఆందోళన అంశంపై ఎక్కువగా ప్రశ్నించడం బట్టి చూస్తే ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు అర్ధమవుతుందని ’ ఆరోపించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ టీడీపీ ఉంటుందని బాబు పేర్కొన్నారు. ‘‘అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుంది. ఇకపై ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం’’ అని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడా జరిగినా తాము పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మూడేండ్లు ముఖ్యమంత్రిగా జగన్‌కు అంత గర్వం ఉంటే 14 ఏండ్ల పాటు సీఎంగా తనకెంత గర్వం ఉండాలని అన్నారు.‘చట్టాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు. చట్టం ప్రకారం పాలన జరగాలి, పోలీసులు అలాగే వ్యవహరించాలని’ సూచించారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని వేల కేసులు పెట్టారో బయట పెట్టాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం తప్పా అని డీజీపీని ప్రశ్నించారు. ప్రభుత్వం టెర్రరిస్టుల మాదిరిగా ప్రజలపై పడి వేదిస్తుందని మండిపడ్డారు. వివేకానందారెడ్డిని హత్యచేసిన నిందితులలకు ప్రాణాపాయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డీజీపీకి డిమాండ్‌ చేశారు.

Related Posts