YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నల్లకుంట ఫివర్ ఆసుపత్రిలో ఒపిడీ బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

నల్లకుంట ఫివర్ ఆసుపత్రిలో ఒపిడీ బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్
ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ కు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం శంకుస్థాపన చేసారు. తరువాత  13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ  చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,  డిఎంఈ  రమేష్ రెడ్డి, ఐపిఎం  డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇంఛార్జి శంకర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీన హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ..  ఫీవర్ ఆసుపత్రిలో ఈరోజు రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది.   దీంతో పాటు ఇదే వేదికగా 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ లను ప్రారంభించుకున్నాం. దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు.    సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ హాస్పిటల్ ను విజిట్ చేశారు.    హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణం 5 కోట్లు విడుదల చేశారు.    ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉంది. 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైంది. కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచింది.    అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుంది. ఓపి  రోజుకు సగటున 500-600, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నారు. అందుకే కొత్త  బ్లాక్ ను నిర్మించుకున్నాం.     ఫీవర్ హాస్పిటల్ లో మార్చురీ అభివృద్ధికి 60 లక్షలు మంజూరు. రూ.50 లక్షలతో డయాలసిస్ వింగ్ మంజూరు చేసాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ కోసం 5-10 వేలు ఖర్చు అయ్యేది.   ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచితంగా పార్థివ వాహనాలను ప్రవేశపెట్టింది.   మర్చురిలను అభివృద్ధి చేస్తున్నాం. 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసింది.  ఇండియాలోనే బెస్ట్ మర్చూరిలను అధ్యయనం చేసి.. 9కోట్లతో ou hospital లో అభివృద్ధి చేస్తున్నాం.   నిన్న పార్లమెంట్ లో.. భారత దేశం లో ఏ రాష్ట్రాలు పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాయి అని ఒక ఎంపీ అడిగితే.. 3వ స్థానం లో ఉందని కేంద్రం చెప్తున్నది.   ప్రజా వైద్యంలో రూ. 1690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం.   గాంధీ, ou, కోరంటి మీద లోడ్ పెరిగింది. కాబట్టి సీఎం కెసిఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లు కడుతున్నారు.   సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖాన లు ఇవ్వలేదు.   గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారు.   దవాఖానలో మందుల కొరత ఉండొద్దు.   వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు.

Related Posts