చెన్నై ఫిబ్రవరి 14,
తమిళనాడులో రెండు పార్టీల నాయకుల మధ్యకు మాటల వార్ జరిగింది. పరుష పదజాలంతో ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకున్నారు. ఇందుకు కారణం ఏంటో తెలిశాక మాత్రం షాక్ తిన్నారు. అవును… ఎడిఎంకే, అధికార డిఎంకె పార్టీల మధ్య రగడకు కారణం కుక్కలు. తమిళనాడులో అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దిండుగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 32 వ డివిజన్ పుత్తూరు ప్రాంతంలో ఎడిఎంకే ఎన్నికల ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఉదయానికి ఆ బ్యానర్ చినిగిపోయి ఉంది. ఇది కచ్చితంగా ప్రత్యర్థి పార్టీ డిఎంకె పని అయి ఉంటుందని ఎడిఎంకే పార్టీ నేతలు భావించారు. ఇదే అంశంపై ఇరు పార్టీల మధ్య చిచ్చు రేగింది.. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పరిస్థితి శృతి మించడంతో పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టి సారించారు. సమీపంలో ఉన్న సిసి ఫుటేజీ పరిశీలించారు.. అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు… రాత్రి వేళ వీధి కుక్కలు ఆ బ్యానర్ ని చించిన దృశ్యాలు చూసి ఆ పార్టీ నేతలు కంగు తిన్నారు.. మొత్తానికి కుక్కల వల్ల రెండు పార్టీల మధ్య రగడ రేగింది.. సిసి కెమెరా ఆ విజువల్స్ రికార్డు కాకుండా ఉంటే.. ఎంత రచ్చ జరిగేదో చెప్పనక్కర్లేదు.